Friday, January 24, 2025

IFTU లో చేరిన NTR జిల్లా బిల్డింగ్ కన్ స్ట్రక్షన్స్ రి.నెం K-379 (BCW)

ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం
CPI(ML) న్యూ డెమోక్రసీ పార్టీ అనుబంధ సంస్థ అయిన I F T U (భారత కార్మిక సంఘాల సామాఖ్య) అనుబంధం గా IFTU లో చేరిన NTR జిల్లా బిల్డింగ్ కన్ స్ట్రక్షన్స్ రి.నెం K-379 (BCW)


NTR జిల్లా బిల్డింగ్ కన్ స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ స్థాపించి రెండు సంవత్సరాల ఎనిమిది నెలల్లో జిల్లాలో ఐదు నియోజకవర్గాల్లో కమిటీలను ఏర్పాటు చేసుకుని నిరంతరం భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం గత ప్రభుత్వంపై రాజీలేని పోరాటాలు చేస్తూ కార్మికులకు ఏ సమస్య వచ్చినా మేమున్నామని భరోసా ఇస్తూ ప్రమాదాల బారిన పడి చనిపోయిన కాళ్లు చేతులు విరిగిన ఆ కార్మికులు ప్రమాదాలకు గురైన ప్రదేశాల్లో యజమానులు యూనియన్ నాయకత్వం ప్రమాదానికి గురైన కార్మికుల కుటుంబ సభ్యులు కలిసి ఆ కార్మికులకు కుటుంబాలకు ఆర్థిక సహాయాలు సుమారుగా రెండు కోట్ల పైసలుకు ఇప్పించే దాంట్లో ప్రధాన భూమిక పోషించిన(BCWU)

అట్లాగే కార్మికులు అనారోగ్యం పాలయి ఆర్థిక పరిస్థితి లేక ఇబ్బందులు పడుతున్న కార్మికులకు యూనియన్ నుండి యూనియన్ లో పనిచేస్తున్న కార్మికుల సహాయ సహకారాలతో అనేకమంది కార్మికులకు ఆర్థిక సహాయాలు అంద చేయడం జరిగింది

ఇసుక క్వారీలను తెరిపించాలని ఇసుకను ఉచితంగా సరఫరా చేయాలని అట్లాగే సర్కులర్ 1214 ను తక్షణమే రద్దుచేసి భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును యధావిధిగా అమలు చేసి గడచిన ఐదు సంవత్సరాలుగా ప్రమాదాల భారినపడి చనిపోయిన కాళ్లు చేతులు విరిగిన మహిళలకు డెలివరీ లకు అనారోగ్యం పాలైన భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డుకి ఇవ్వవలసిన నష్టపరిహారాలు ఆర్థిక సహాయాల కోసం అప్లై చేసుకున్న భవన నిర్మాణ కార్మికులకు ఇవ్వవలసినవి తక్షణమే ఇవ్వాలని కోరుతూ గత ప్రభుత్వంపై అలుపెరగని పోరాటాలు చేసిన భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పట్టించుకోలేదు
భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ కన్ స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ మరింత బలోపేతం అయ్యే దానికోసం ఈ రోజున IFTUలో అనుబంధం తీసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ కన్ స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్IFTU అనుబంధం ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగారాజీలేని పోరాటాలు చేయాలని దిశగా పయనించాలని ఈ రోజునIFTU ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ కన్ స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ జిల్లా సిటీ మండల గ్రామ పట్టణ కమిటీ ల అధ్యక్ష కార్యదర్శులు 150 మంది ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు అనంతరం ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఇసుకను ఉచితంగా సరఫరా చేస్తానని ప్రకటన చేసి పాత పద్ధతిలోనే టన్ను 300 200 400 అనే పద్ధతుల్లో వ్యవహరిస్తుంది అదే పద్ధతుల్లో కొనసాగితే గతంలో మాదిరిగానే ఇసుక మళ్ళీ అందని ద్రాక్షగా తయారవుతుందని కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల జీవనోపాధి పోకుండా ట్రాన్స్పోర్ట్ ట్రావెలింగ్ తీసుకొని ఇసుకను ఉచితంగా సరఫరా చేయాలని ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మికులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో IFTU జాతీయ నాయకులు ఆరెళ్ళ కృష్ణ

IFTUరాష్ర ఉపాధ్యక్షులు చికట్ల వెంకటేశ్వరరావు

IFTU రాష్ట్ర ప్రధానకార్యదర్శి m.రామకృష్ణ

IFTU కార్యదర్శి
K.రమేష్

కోశాధికారి బాలరాజు
రాష్ట్ర కమిటీ సభ్యులు సారి రాజశేఖర్

ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జి హరికృష్ణ రెడ్డి
షేక్ మీరావాలి

ఉపాధ్యక్షులు
కొప్పుల కుమారు ఇనపనూర్తి.విజయరావు
జిల్లా సహాయ కార్యదర్శులు ఆదిమల్ల పెద్దిరాజు మల్లవరపు బ్రహ్మయ్య భక్తుల కాళీ

కోశాధికారి పి వెంకట సుబ్బారావు

మరియు జిల్లా కమిటీ సభ్యులు తిరుమల శెట్టి సత్యనారాయణ జీనేపల్లి స్వామి
ఎస్ మధు
పిల్లి సిద్ధారెడ్డి
కాంతి

అట్లాగే విజయవాడ పడమట కమిటిల నాయకులు

వెస్ట్ సిటీ కమిటీ ల నాయకులు
సెంట్రల్ సిటీ కమిటీ ల నాయకులు
మరియు

నందిగామ
నియోజకవర్గ మండల పట్టణ గ్రామ కమిటీల నాయకులు

మైలవరం నియోజకవర్గ మండలాల పట్టణ గ్రామ కమిటీల నాయకులు మరియు భవన నిర్మాణ కార్మికులు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular