భారతదేశ స్వాతంత్ర్య సమర_యోధుడు రగిలే విప్లవ జ్వాల సర్దార్ భగత్ సింగ్
AISF జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీరంగ
_హోళగుంద మండల కేంద్రం స్థానిక తేరు బజార్ నందు AISF ఆధ్వర్యంలో “సర్దార్ భగత్ సింగ్” 117వ జయంతి _వేడుకల సందర్భంగా సర్దార్ భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది.
ఈ సందర్భంగా AISF జిల్లా ఉపాధ్యక్షుడు పి.శ్రీరంగ AISF మండల కార్యదర్శి సతీష్ కుమార్ AISF మండల అధ్యక్షుడు కాకి గాదిలింగ మాట్లాడుతూ సర్దార్ భగత్ సింగ్ 23 ఏళ్ళ వయసులోనే ఉరి కొయ్యను ముద్దాడి తన ప్రాణాలను అర్పించిన ధైర్యశాలి సర్దార్ భగత్ సింగ్. చిరునవ్వుతోనే మృత్యువును కౌగిలించుకుని.దేశ స్వాతంత్ర్యం కోసం తమా ప్రాణాలను త్యాగం చేసి అమరులైన సర్దార్ భగత్ సింగ్,రాజ్ గురు, సుఖ దేవ్,స్ఫూర్తితో వారి అడుగుజాడల్లో నడవాలి.మన దేశ రాష్ట్ర భవిష్యత్తు కోసం విద్యార్థులు యువకులు ఉద్యమాలకు నడుం బిగించి పోరాటాలకు సిద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో AISF నాయకులు వెంకటేష్ తరుణ్ రంజిత్ తదితరులు పాల్గొన్నారు.
AISF ఆధ్వర్యంలో సర్దార్ భగత్ సింగ్ 117వ జయంతి వేడుకలు
RELATED ARTICLES