Tuesday, January 14, 2025

హోళగుంద నుండి ధనాపురం వరకు రోడ్డు కోసం పాదయాత్ర

TEJA NEWS TV

ఇండియా కూటమి ఆధ్వర్యంలో కదలిన రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు

ఆదోని సబ్ కలెక్టర్ వినతిపత్రం సమర్పించిన నాయకులు

జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పరిగెల మురళీకృష్ణ

రెండు దశాబ్దాలకు పైగా  రోడ్డు నిర్మాణానికి నోచుకోక… గుంతల మయంగా మారిన రోడ్డులో ప్రయాణానికి వీలుకాక  హోళగుంద మండల ప్రజలు  పడుతున్న ఇబ్బందులపై  ఇండియా కూటమి ఆధ్వర్యంలో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు  కదం తొక్కాయి. సోమవారం మండల పరిధిలోని హెబ్బటం గ్రామం నుంచి  చుట్టుపక్కల గ్రామాల ప్రజలతోపాటు  కాంగ్రెస్ పార్టీ సిపిఐ  సిపిఎం ఎం ఆర్ పి ఎస్  విద్యార్థి సంఘాలు నాయకులు జెండాలు చేతపట్టి  హోలగుంద నుండి ధనాపురం వరకు తారు రోడ్డు నిర్మాణం వెంటనే చేపట్టాలని  అధ్వానమైన రోడ్డును బాగు చేయాలని  రోడ్డు బాగుంటేనే గ్రామాలు బాగుంటాయని నినాదాలు చేస్తూ ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు  పాదయాత్రను   చేపట్టారు. దాదాపు 20 కిలోమీటర్ల పాదయాత్రను  కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పరిగెల మురళీకృష్ణ  జెండా ఊపి  ప్రారంభించారు. ఆలూరు తాలూకా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్  చిప్పగిరి లక్ష్మి నారాయణ ఆధ్వర్యంలో  మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదేవిధంగా సిపిఎం నాయకులు హనుమంతు నారాయణస్వామి  ఆధ్వర్యంలో వామపక్షాల కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో  పాల్గొని రోడ్డు సౌకర్యం వెంటనే కల్పించాలని డిమాండ్ చేస్తూ పాదయాత్రను కొనసాగించారు. సందర్భంగా కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మురళీకృష్ణ మాట్లాడుతూ  స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా  రోడ్డు కోసం పోరాటం చేయాల్సిన దుస్థితి ఉండడం సిగ్గుచేటు అని అన్నారు. ప్రతిరోజు  ప్రభుత్వాధికారులు రోడ్డు గుండా ప్రయాణాలు చేస్తున్నారని. ఆయన వారికి చీమకుట్టినట్లు కూడా లేదని  రోడ్డు నిర్మాణం కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే  కాంట్రాక్టర్ ఎందుకు పనులు చేయలేదని ప్రశ్నించారు. ఆలూరు తాలూకా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చిప్పగిరి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ  రోడ్డు నిర్మాణం కోసం ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల  చేసి హోళగుంద మండలం ప్రజలు రైతులు విద్యార్థులు మహిళల యొక్క ఇబ్బందులు తీర్చాలని  డిమాండ్ చేశారు. అదేవిధంగా అత్యవసర పరిస్థితుల కోసం  గర్భిణీ స్త్రీలు ఆదోని  ఆసుపత్రికి పోవాలంటే అంబులెన్స్ లో గాని పరిస్థితులు నెలకొన్నాయని  విమర్శించారు. సిపిఎం నాయకులు హనుమంతు నారాయణ స్వామి మాట్లాడుతూ  రోడ్డు నిర్మాణ పనుల కోసం ప్రారంభమైన పోరాటం  పాదయాత్రతోనే ఆగిపోదని ప్రభుత్వం స్పందించి వెంటనే నిర్మాణం చేపట్టకపోతే రాబోయే రోజుల్లో నిరసన నిరాహార దీక్షలకు దిగుతామని హెచ్చరించారు. ఎమ్మార్పీఎస్ నాయకులు  గూల్యం యల్లప్ప  , హొళగుంద వెంకటేష్ మాట్లాడుతూ రోడ్డు లేకపోవడం వల్ల బస్సులు రాక  ప్రజలు పడుతున్న ఇబ్బందులను  గుర్తించాలని వెంటనే రోడ్డు పనులు ప్రారంభించి  విద్యార్థులు యువత సామాన్య మద్దతు ప్రజల సమస్యలను తీర్చే ఆదుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం సిపిఐ ఎంఆర్పిఎస్  విద్యార్థి సంఘాల నాయకులు ప్రజలు  కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular