TEJA NEWS TV
కర్నూలు జిల్లా ఆలూరు తాలుక్ హొళగుంద మండల కేంద్రంలోని ఈరోజు సాయంత్రం B.G.హళ్లి గ్రామాన్ని సందర్శించడం జరిగినది. గ్రామంలోని ప్రజలను సమావేశపరచి చదువు యొక్క ప్రాధాన్యత గురించి తెలియజేయడమైనది. ఎవరు కూడా సైబర్ నేరగాళ్ల వలలో పడకూడదని వారికి వివరంగా తెలియజేయడమైనది, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ ఎలాంటి ప్రమాదాలకు గురికాకుండా జీవించాలని తెలియజేయడమైనది.అలాగే ఎస్సై బాల నరసింహులు ps మాట్లాడుతూ ఎవరు కూడా తగిన అనుమతులు లేకుండా బాణసంచా(పటాసులను) కలిగి ఉండడం గానీ, విక్రయించడం కానీ నేరం అని హెచ్చరించడమైనది. అలా అనుమతులు లేకుండా అక్రమంగా పటాసులను విక్రయించిన ఎడల వారి పైన చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోబడునని వారు తెలియజేయడమైనది. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు