


TEJA NEWS TV
నూతన చిత్ర నిర్మాణానికై ప్రోడక్షన్ నెంబర్-1 లో భాగంగా నటీనటులను సంప్రదించిన సినీ నిర్మాత తోక వెంకటేష్ మరియు డైరెక్టర్ శ్రీ అజయ్ సూర్య గారు శనివారం సీనియర్ నటులు డైలాగ్ కింగ్ శ్రీ సాయికుమార్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి సాయికుమార్ గారి 50 వసంతాల దిగ్విజయ సీనిప్రయాణం పూర్తి చేసుకున్న శుభసందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
తదనంతరం సినీ నిర్మాత తోక వెంకటేష్ మరియు దర్శకుడు అజయ్ సూర్య మాట్లాడుతూ తమ నూతన సినిమాలో నటనకై డైలాగ్ కింగ్ సాయికుమార్ గారిని సంప్రదించగా ఆయన సానుకూలంగా స్పందించడమే కాక సినిమా నిర్మాణం గూర్చి విలువైన సలహా, సూచనలను చేస్తూ సినిమా మెలుకువలు తీసుకువాల్సిన జాగ్రత్తలు తదితర విషయాలను పరంగా క్షుణ్ణంగా వివరించారన్నారు.
ఇప్పటికే సినిమా బృందం లొకేషన్స్, తదితర సినీ కార్యకలాపాలను పూర్తి చేసుకున్నదని సినిమా టైటిల్ మరిన్ని పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామన్నారు.
ఈ బృందంలో సినీ యూనిట్ సభ్యులు ఎరిగేరి వీరేష్, ఖాదర్ బాషా, గోవర్ధన్,కుప్పగల్లు శీను, నాగేష్, రహమతుల్లా తదితరులు పాల్గొన్నారు.