అవగాహన, జాగ్రత్తలతోనే హెచ్ఐవి నివారణ సాధ్యమవుతుందని వై ఆర్ జి కేర్ పౌండేషన్ లింక్ వర్కర్ స్కీమ్ లింక్ వర్కర్ బాలకిషన్ తెలిపారు. గురువారం కామారెడ్డి జిల్లా మాచారెడ్డి లోని పీహెచ్ సీ లో ఆశా డే సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా లింక్ వర్కర్ బాలకిషన్ మాట్లాడుతూ.. .. లింక్ వర్కర్ స్కీం అందిస్తున్న సర్వీస్ ల గురించి తెలిపారు. హెచ్ఐవి, టిబి, సుఖ వ్యాధులపై అవగాహన కల్పించారు. అవగాహనతోనే ఆయా వ్యాధుల నివారణ జరుగుతుందన్నారు. హెచ్ఐవి నివారణ జాగ్రత్తలను వివరించారు. లింకు వర్కర్ స్కీం సేవలకు సహకారం అందించాలని కోరారు. కార్యక్రమంలో పి హెచ్ ఎన్ రుద్రమదేవి, ఎం ఎల్ హెచ్ పి లు వేణు మాధవ్, శ్రీకాంత్, ఎంపీహెచ్ఏలు నరసరాజు, తబిత, రాధా, భారతి, సుమలత, పద్మ, అంజలి, రేణుక, గీత, వివిధ గ్రామాల ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.