తీవ్ర తుఫాను ముంచుకొస్తున్న సందర్భంగా సత్యవేడు సీఐ సర్కిల్ పరిధిలోని పోలీస్ స్టేషన్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్న సిఐ మురళి……
ఎలాంటి ప్రాణనాష్టం, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు…..
వరదయ్యపాలెంలో సిబ్బంది తక్కువగా ఉండడంతో సత్యవేడు నుండి హుటాహుటిన సిబ్బందిని పిలుచుకొని వరదయ్యపాలెం మండలంలోని ముంపు ప్రాంతాలలో విధులు నిర్వహిస్తున్న సిఐ మురళి…..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….
వాతావరణ శాఖ తీవ్రత తుఫాను ముప్పు ఉందన్న హెచ్చరికలతో జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, పుత్తూరు డిఎస్పి పర్యవేక్షణలో పోలీసు శాఖ అప్రమత్తంగా ఉందని….
ప్రజలకు ఎలాంటి ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని సెలవులు రద్దు చేయడం జరిగిందని, ప్రజలు కచ్చితంగా ఆరోగ్య జాగ్రత్తలు ప్రయాణ జాగ్రత్తలు తీసుకోవాలని, వాగులు వంకలు, చెరువులు ప్రమాదకర నీటి గుంటల వద్దకు వెళ్లరాదని అత్యవసర పరిస్థితులు ఏర్పడితే పోలీసు శాఖకు కచ్చితంగా సమాచారం ఇవ్వాలని ప్రధాన రహదారుల సమీపంలో వంతెనలు దాటే సమయంలో జాగ్రత్తలు వహించాలని….
పోలీసు సిబ్బందిని విధుల్లో పెట్టడం జరిగిందని…. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని… సత్యవేడు సీఐ సర్కిల్ పరిధిలోని నాగలాపురం వరదయ్యపాలెం సత్యవేడు మండలాల లోని స్థానిక మండల స్థాయి అధికారులతో కలిసి సంయుక్తంగా తుఫానును ప్రభావాన్ని ఎదురుకొని ప్రజలను సురక్షితంగా ఉంచడానికి శాయశక్తుల కృషి చేస్తామని… అవసరమనుకుంటే జిల్లా పాలనాధికారి మరియు ఎస్పీ గారి ఆదేశాలతో ముంపుకు గురయ్యే ప్రాంతాలను ముందుగానే గుర్తించి అక్కడి ప్రజలను సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలించి తమ పర్యవేక్షణలోనే తుఫాను గండం గట్టెక్కేంతవరకు జాగ్రత్తగా గమనిస్తామని….
తెలిపారు……
సీఐ సుడిగాలి పర్యటన
RELATED ARTICLES