*గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో పోసిన
సిసి రోడ్లు కొన్ని బీటలు వారుతున్నయని
ప్రజలు కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.
చండ్రుగొండ, సెప్టెంబర్ 01. చంద్రుగొండ మండల పరిధిలోని గ్రామాలలో బిఆర్ఎస్ ప్రభుత్వం మండల వ్యాప్తంగా గల 14 పంచాయతీల్లో కోట్లాది రూపాయల వ్యయంతో ఎన్ఆర్ఈజీఎస్ మరియు సిడిపి ద్వారా మంజూరైన సిసి రోడ్లు కొన్ని నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా లేవని ఇప్పటికే రోడ్ల పైన పగులుడు కుంగిపోవడం కంకర లెగిసిపోవడం జరుగుతున్నాయని వీటి అన్నింటి పై సమగ్ర విచారణ జరపాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజాధనం దుర్వినియోగంగా మారుతుందని అదేవిధంగా కలెక్టర్కు వినతిపత్రం అందించి రోడ్ల నాణ్యత ప్రమాణాలపై అధికారులు చేత తనిఖీలు చేయించాలని ప్రజలు కోరుతామన్నారు.
సిసి రోడ్ల నాణ్యత ప్రమాణాలపై క్వాలిటీ కంట్రోల్ బోర్డ్ పర్యవేక్షణ ఉందా?
RELATED ARTICLES