TEJA NEWS TV:
సివిల్ రైట్స్ డే నిర్వహించి చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆంధ్రప్రదేశ్ దళిత సమాఖ్య మరియు ఉషోదయ గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శనివారం డిప్యూటీ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ శ్రీనివాస రెడ్డి, తాసిల్దార్ హుస్సేన్ సాబ్ కు వినతి పత్రం అందించినట్లు ఉషోదయ గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రెసిడెంట్ సిహెచ్ నాగరాజు దళిత సమాఖ్య మండల అధ్యక్షులు నల్ల మల్లేష్ లు అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి నెల చివరి రోజు పౌర హక్కుల దినోత్సవం జరుపుకోవడం ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించడంతోపాటు వారిని చైతన్య పరిచినట్లు అవుతుందన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు చట్టాలపై పూర్తి అవగాహన లేకపోవడం వల్ల అక్కడక్కడ ఘర్షణాలు జరుగుతున్నాయని వారు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలు చిన్న చిన్న విషయాలకు ఘర్షణలకు దిగకుండా ఉండాలంటే జీవో, ఎంఎస్, నెంబర్128 అంటరానితనం అస్పృశ్యత, అత్యాచారములపై పూర్తిగా అవగాహన కల్పించవలసిన బాధ్యత మండల స్థాయి అధికారులపై ఉందన్నారు ఇప్పటినుండి ప్రతి గ్రామంలో నెల చివరి రోజు పౌర హక్కుల దినోత్సవం నిర్వహించాలని కోరారు ఈ కార్యక్రమంలో బాదిగ రామాంజనేయులు, ముగ్గు గోవిందు తదితర నాయకులు పాల్గొన్నారు.
సివిల్ రైట్స్ డే నిర్వహించి చట్టాలపై అవగాహన కల్పించండి
RELATED ARTICLES