TEJA NEWS TV :
రిపోర్టర్లు కావలెను 9985859485
సినీ నటి శ్రీరెడ్డిపై (Sri Reddy) కర్నూలు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికలకు ముందు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు లోకేశ్, అనితలపై ఆమె అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపి నేతలు ఫిర్యాదు చేశారు.ఈ మేరకు కర్నూలు (Kurnool) త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో టీడీపీ నేత రాజు యాదవ్ కంప్లైంట్ చేశారు. దీంతో శ్రీరెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కాగా, ఎన్నికలకు ముందు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రులు లోకేశ్, అనిత సహా కొందరు టీడీపీ నేతలపైనా శ్రీరెడ్డి సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేశారనే విమర్శలున్నాయి. ఎన్నికల తర్వాత కూడా సీఎం, ఆయన కుటుంబంపై అసభ్యకర కామెంట్స్ చేశారని.. వీడియోల రూపంలో సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారని టీడీపీ నేతలు ఆరోపించారు. శ్రీరెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు.