

ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మంచినీళ్లు లేక విద్యార్థులు ఆవేదన జగన్ మామయ్య మేనల్లులకు, మేనకోడళ్లకు త్రాగునీరు ఎక్కడ జగnన్ మామయ్య
తేజ న్యూస్ రిపోర్టర్
దాసరి శేఖర్
విద్యార్థులు ఆవేదన
సిద్ధవటం
సిద్ధవటం మండలం వెంకటాయపల్లె ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు, విద్యార్థినిలకు జగన్ మామయ్య అందిస్తున్న గోరుముద్ద తిన్న తర్వాత మంచినీటి వసతి లేక ఇంటి దగ్గర నుండి నీళ్లు బాటిల్ తెచ్చుకుంటున్నామని విద్యార్థులు విద్యార్థినిలు ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి విద్యార్థికి మేనమామ గా ఉంటానని ప్రభుత్వ స్కూల్ నందు చదువుతున్న మేనకోడళ్లకు, మేనల్లులకు మీ మామ గా ఉంటాను అన్ని వసతులు సమకూరుస్తానని చెప్పిన వెంకటాయపల్లె ప్రాథమిక పాఠశాలలో నీళ్లు లేక అవస్థలు పడుతున్న విద్యార్థులు ఆర్వో సిస్టం పని చేయక దాదాపు ఆరు మాసాలు పైన అయిందని అధికారులు తక్షణమే స్పందించి స్కూల్లో ఉన్న మంచినీటి సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు తెలియజేశారు