తేజ న్యూస్ టివి ప్రతినిధి. సంగెం.
ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన సంగెం గ్రామానికి చెందిన మెట్టిపల్లి భాస్కర్ ( డ్రైవర్) అకాస్మికంగా మరణించడం ఆ కుటుంబానికి కొండంత అడ్డ కోల్పోయారు 35 సంవత్సరాల సుదీర్ఘ డ్రైవర్ సేవలందించి తాను కష్టపడితేనే ఆ కుటుంబం పూట గడిచేది ఇప్పుడు దిక్కులేని అనాధగా మారింది. మహమ్మారి క్యాన్సర్ తో బాధపడుతూ హాస్పటల్లో అనేక ఖర్చులు పాలయ్యారు ఆ కుటుంబానికి అండగా ఉన్న సమయంలో సంగెం వాట్స్అప్ గ్రూప్ ఇతర వాట్సాప్ గ్రూప్ ల ద్వారా ఆ కుటుంబానికి అండగా ఉండి సహాయం చేయాలని పులి రాజశేఖర్ విన్నవించుకోక దాతల సహకారంతో ఆ కుటుంబానికి విరాళాలు సేకరించారు. ప్రతి ఒక్క దాత నేనున్నానంటూ ముందుకు వచ్చి తమకు తోచిన విధంగా పులి రాజశేఖర్ కు ఫోన్ పే, గూగుల్ పే, నగదు రూపంలో వారికి అందజేశారు ఆర్థిక సహాయం చేసిన దాతలు ద్వారా వచ్చిన డబ్బులు, మొత్తం రూపాలు 71730 అందులోనుండి మృతుడి తల్లి మెట్టిపల్లి శాంతమ్మ ఆరోగ్యం కూడా బాగా లేదు కావున వారిపై5,0000/రూపాయలు యూనియన్ బ్యాంకు లో డిపాజిట్ చేయడం జరిగింది మిగతా డబ్బులు 21,730 రూపాలు మరియు, ఫిక్స్ డిపాజిట్ బ్యాంకు బుక్కు, నగదు రూపాలు1 క్వింటా బియ్యం మెట్టిపల్లి భాస్కర్ ఇంటి వద్దకు వెళ్లి మృతుడి తల్లి,కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది ఆ కుటుంబానికి ఆర్థిక సాయం డబ్బులు సేకరించిన పులి రాజశేఖర్ ను మండల కేంద్రంలో ఉన్న పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో కందకట్ల నరహరి, మెట్టిపల్లి రమేష్, కోడూరి సదయ్య, ఆగపాటి రాజు,మేట్టిపల్లి ఏలియా, మునుకుంట్ల మోహన్, మెట్టిపల్లి ప్రవీణ్, గుండేటి వాసు, తదిరులు పాల్గొన్నారు.