TEJA NEWS TV
వనపర్తి జిల్లా ఆత్మకూర్ మండలం మూలమల్ల గ్రామంలో శ్రీశ్రీశ్రీ పాండురంగ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రోజు మక్తల్ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు చిట్టెం రాంమోహన్ రెడ్డి శ్రీ పాండురంగ స్వామి వారిని దర్శించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు శ్రీధర్ జోషి ఆధ్వర్యంలో చిట్టెం రాంమోహన్ రెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించారు.ఇట్టి కార్యక్రమంలో ఆత్మకూరు మండలం మాజీ ఎంపీపీ బంగారు శ్రీనివాసులు, బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రవికుమార్ యాదవ్, వార్డ్ కౌన్సిలర్ మండ్ల రామకృష్ణ, బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వీరేశలింగం, జి వేణుగోపాల్ రెడ్డి, గ్రామ అధ్యక్షులు గడ్డం భీమన్న, కో ఆప్షన్ సభ్యులు షేక్ మహబూబ్ బాషా, మాజీ ఉపసర్పంచ్ రంగారెడ్డి, గ్రామ నాయకులు పిన్నంచర్ల మాసన్న, రాఘవేంద్ర, తదితరులు పాల్గొన్నారు.
*వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు*
ఆత్మకూరు మండలం మూలమల్ల గ్రామంలో వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమాల వేసి ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ శాసనసభ్యులు చిట్టెం రాంమోహన్ రెడ్డి. ఇట్టి కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
శ్రీశ్రీశ్రీ పాండురంగ స్వామి బ్రహ్మోత్సవ వేడుకలకు హాజరైన మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి
RELATED ARTICLES