Wednesday, March 19, 2025

శివాలయ భూమిని, కబ్జా చేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి—కలెక్టర్ ప్రావీణ్యాకు వినతి పత్రం అందజేసిన మొండ్రాయి గ్రామస్థులు

తేజ న్యూస్ టివి ప్రతినిధి సంగెం.



సంగెం మండలం మొండ్రాయి గ్రామానికి చెందిన శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థాన కమిటీ వారు శివాలయ భూమి కబ్జా,చారిత్రక కట్టడాలను నేల కూల్చాలని ప్రయత్నం చేసిన వీరగోని రమేష్ దంపతులపై కలెక్టరేట్ లో జరుగుతున్న ప్రజా వాణి నందు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ను కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది.
ఇట్టి అక్రమ కబ్జాలపై తీవ్రంగా స్పందించిన కలెక్టర్  వెంటనే మొత్తం విచారణకు అధికారులకు ఆదేశాలు జారీ చేసారు.
శివాలయంను శివాలయ పరిసర ప్రభుత్వ భూమిని కాపాడతామని తెలియజేశారు.సదరు కబ్జాదారులపై చట్టరీత్యా కఠిన చర్యలు చేపడతామని వారసత్వ కట్టడాలను,పురాతన ఆలయాలను ఎవరు కూల్చివేయకూడదని,కబ్జా చేయకూడదని ఒకవేళ ఎవరైనా నిభందనలను అతిక్రమించి కూల్చివేతలకు పాల్పడ్డా,కబ్జాలకు పాల్పడిన పూర్తి స్తాయిలో విచారించి దోషులుగా రుజువైతే జైలుకు పంపుతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థాన కమిటీ అధ్యక్షుడు చెవ్వ మొగిలి,ఉపాధ్యక్షుడు కడ్దూరి సంపత్,వర్కింగ్ ప్రెసిడెంట్ కక్కెర్ల వీరస్వామి,ప్రధాన కార్యదర్శులు పెండ్లి పురుషోత్తం రెడ్డి,గూడ విజయ్,కోశాధికారి పెండ్లి రమేష్,ప్రచార కార్యదర్శి పొన్నాల హరీష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular