శాంతియుతంగా గణేష్ ఉత్సవాలు జరపండి.
గణేష్ మండపం వద్ద జాగ్రత్తలు తీసుకోవాలి
ఏటూరు నాగారo ఏ ఎస్ పి శివమ్ ఉపాధ్యాయ.
ములుగు జిల్లా ఎటునాగారం మండల కేంద్రంలో వినాయకుడి మండపాలు ఏర్పాటు చేసే భక్తులు
శాంతియుతంగా గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలని
ఏ ఎస్పీ ఏటూరు నాగారo శివమ్ ఉపాధ్యాయ తెలిపారు.
ములుగు జిల్లా ఎస్పీ శబరిష్ ఆదేశాల మేరకు ఏటూరు నాగారం ఏ ఎస్పీ కార్యాలయంలో సోమవారం సిఐ అనుముల శ్రీనివాసు. ఎస్సై తాజుద్దీన్ ఆధ్వర్యంలో పీస్ సమావేశం నిర్వహించారు.
సెప్టెంబర్ 7 నుండి 17వరకు నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని గణేష్ మండపాల వద్ద ఏలాంటి అల్లర్లు గొడవలు జరగకుండా ఉత్సవ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు. తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.. గణేష్ మండపం ఏర్పాటుకు పోలీసుల అనుమతి తీసుకోవలసిన అవసరం లేదని. ఆయా గ్రామాల వారిగా వినాయకుని ఏర్పాటు చేసే వారు సమాచారం పోలీస్ స్టేషన్లో అందిస్తే సరిపోతుందని స్పష్టం చేశారు.
, రాత్రి 10 దాటి ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.వినాయకుని ఉత్సవాల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలిగిన
ఏటూరు నాగారం పోలీస్ స్టేషన్ కు 100కాల్ చేయాలన్నారు.
శాంతియుతంగా గణేష్ ఉత్సవాలు జరపండి -ఏటూరు నాగారo ఏ ఎస్ పి శివమ్ ఉపాధ్యాయ
RELATED ARTICLES