ఉన్నతలక్ష్యంతో విద్యార్థులు దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలి
వరదయ్యపాలెం జెడ్ పి ఉన్నత పాఠశాలలో ఘనంగా సరస్వతి పూజ.. వీడ్కోలు కార్యక్రమం
విద్యార్థులకు విద్యాసామాగ్రిని పంపిణీ చేసిన స్టేట్ కాపు బలిజ కన్వీనర్ విజయ్ కుమార్
వరదయ్యపాలెం మర్చి 14 తేజన్యూస్ టీవీ
ఉన్నతవిద్యే శ్వాసగా శ్రమించి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉన్నతలక్ష్యంతో దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలని ప్రధానోపాధ్యాయులు రమణయ్య విద్యార్థులను కోరారు.వరదయ్య పాలెం జెడ్పీ ఉన్నత పాఠశాలలో గురువారం సరస్వతి పూజను ఘనంగా నిర్వహించారు. పదో తరగతి పరీక్షల్లో మంచి ఉత్తీర్ణతతో ఉత్తమ ఫలితాలు సాధించాలని సరస్వతిదేవికి పూజలు చేశారు. అనంతరం పదోతరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం జరిగింది.స్టేట్ కాపు బలిజ కన్వీనర్ నాయకులు విజయ్ కుమార్ పిల్లలకి విద్యాసామాగ్రిని వితరణగా పంపిణీ చేశారు.కార్యక్రమంలో పాఠశాల కమిటీ ఛైర్మెన్, పి ఈ టి బందిల కుమార్, పాఠశాల అభివృద్ధి దాత ఇనుప రాజేంద్ర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
విద్యార్థులకు విద్యాసామాగ్రిని పంపిణీ చేసిన స్టేట్ కాపు బలిజ కన్వీనర్ విజయ్ కుమార్
RELATED ARTICLES