తేజ న్యూస్ టీవీ నిజాంసాగర్ : వాహన తనిఖీల్లో 5 లక్షల45 వేల నగదు సీజ్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల నిబంధనలలో భాగంగా వాహన తనిఖీల్లో నిజాంసాగర్ మండలంలోని బ్రాహ్మణపల్లి గేట్ వద్ద జాతీయ రహదారి పై ఏర్పాటుచేసిన చెక్ పోస్ట్ వద్ద బుధవారం ఈ నగదును పట్టుకున్నట్లు నిజాంసాగర్ ఎస్ ఐ కే. సుధాకర్ తెలిపారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కందర్ పట్వాడా గ్రామానికి చెందిన హుస్సేన్ కుమారుడు సమీర్ హుస్సేన్ సాబ్ ఖురేష్ అనే వ్యక్తి హైదరాబాద్ నుండి మహారాష్ట్రలోని ముత్కాడు వైపునాకు వెళ్తూ 5 లక్షల45 వేల రూపాయలు ఎలాంటి ఆధారాలు లేకుండా తీసుకెళ్తున్నాడు.దాంతో వాటిని పట్టుకొని సీజ్ చేసినట్లు ఆయన తెలిపారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా అక్రమంగా డబ్బులు తరలిచ్చినట్లయితే స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది అనిల్ కుమార్, ప్రమోద్ రెడ్డి, సిహెచ్ సాయిలు,విజయ్, సాయిలు, మహేందర్ పాల్గొన్నారు
వాహన తనిఖీల్లో 5 లక్షల 45 వేల నగదు పట్టివేత
RELATED ARTICLES