Wednesday, March 19, 2025

వలస విద్యార్థుల ఆశ కిరణం సీజనల్ హాస్టల్స్

TEJA NEWS TV

కర్నూలు జిల్లా ఆలూరు తాలూక్ హోళగుంద మండలం కేంద్రంలోని ఈరోజు
వలస విద్యార్థులకు సీజనల్ హాస్టల్స్ ఆశకిరణాలుగా నిలుస్తాయని మండల విద్యాధికారి జగన్నాథం అన్నారు. ఆదివారం మండల కేంద్రమైన హోళగుందలో ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష సౌజన్యంతో అంబేద్కర్  ఎస్, హెచ్ జి , వరలక్ష్మి ఎస్ హెచ్ జి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సీజనల్ హాస్టల్ సందర్శించారు. ఈ సందర్భంగా విద్య అధికారి మాట్లాడుతూ మారుమూల మండలంలో సీజనల్ హాస్టల్స్ వలస విద్యార్థులకు ఆశ కిరణాలుగా నిలుస్తున్నాయన్నారు ఇక్కడ 100 మంది విద్యార్థులకు వసతితో పాటు భోజన సౌకర్యం సమృద్ధిగా ఉన్నాయని ఆనందం వ్యక్తం చేశారు. హాజరు పట్టికలో ఉన్న విద్యార్థుల పేర్లను చదివి వలస విద్యార్థులు  వీరే అని నిర్ధారించుకున్నారు. విద్యార్థులను ఒక్కొక్కరిని స్వయంగా పిలుచుకొని అల్పాహారంతో పాటు భోజన సౌకర్యాలు ఎలా ఉన్నాయని అడగగా విద్యార్థులు రుచికరమైన, నాణ్యమైన భోజనం అందిస్తున్నారని తెలిపారు  మీ యొక్క తల్లిదండ్రులు ఏ ఏ ప్రాంతాలకు వలసలు వెళ్లారని అడగగా గుంటూరు, బెంగళూరు హైదరాబాద్ తదితర ప్రాంతాలకు వలస వెళ్లినట్లు విద్యార్థులు తెలిపారు.  ఇక్కడ అన్ని సౌకర్యాలు చక్కగా ఉన్నాయి.మీరు బాగా చదివి మీ తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరు తేవాలన్నారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ ఆఫీస్ కంప్యూటర్ ఆపరేటర్ సాయిబేస్, సీజనల్ హాస్టల్ ఉపాధ్యాయులు సోహెబ్, దుర్గయ్య, కేర్ టేకర్లు జమదగ్ని, లాల్ సాబ్ ,వీరప్ప, వంట మనుషులు లలిత ఈరమ్మ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular