TEJA NEWS TV : వరుస దాడులతో అక్రమ మద్యం తరలించే వారిలో వణుకు పుట్టిస్తున్నారు కోసిగి సెబ్ పోలీసులు. కర్ణాటక మద్యంను ఏపీలోకి తరలించే తుంగభద్ర నది తీరంపై ప్రత్యేక దృష్టిని సారించారు. నది తీరంలో 60 వేల విలువైన కర్ణాటక మధ్యాన్ని నిన్ననే అనగా ఫిబ్రవరి 6 వ తేదీన పట్టుకున్న కోసిగి ఎక్సైజ్ పోలీసులు ఫిబ్రవరి 7 వ తేదీ అర్ధరాత్రి అనగా 1:20 నిమిషాల సమయంలో కోసిగి మండల పరిధిలోని తుమ్మిగనూరు గ్రామంలో గల తుంగభద్రా నది ఒడ్డున ఉన్న కొత్త పంప్ హౌస్ కు అర్ధ కిలోమీటర్ దూరంలో కోసిగి ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ మరియు సెబ్ C.I వారి సిబ్బందితో దాడులు నిర్వహించగా 12 బాక్స్ ల కర్ణాటక మద్యం తరలిస్తున్న వ్యక్తి సెబ్ పోలీసులను చూసి 1150 టెట్రా ప్యాకెట్ల కర్ణాటక మద్యం ను వదిలి పెట్టి పారిపోగా ఆ మద్యం బాక్స్ లను స్వాధీనపరచుకొని మద్యం తరలించిన వ్యక్తి తుమ్మిగనూరు గ్రామానికి చెందిన గోవిందు గా గుర్తించి అతనిపై కేసు నమోదు చేయడం జరిగిందని త్వరలోనే అతనిని అరెస్ట్ చేస్తామని మీడియాకు తెలియజేశారు. ఈ మద్యం విలువ సుమార 47 వేల రూపాయలు ఉంటుందని తెలిపారు దాడులలో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ S.M మహబూబ్ బాషా, సబ్ ఇన్స్పెక్టర్ N.రమేష్ బాబు, హెడ్ కానిస్టేబుల్ రాయుడు ,నాగరాజు కానిస్టేబుల్ మధు , నాగరాజ్ పాల్గొన్నారు
వరుస దాడులతో అక్రమ మద్యం తరలించే వారిలో వణుకు పుట్టిస్తున్న కోసిగి సెబ్ పోలీసులు
RELATED ARTICLES