ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి రైతులు పండించిన అన్ని రకాల పంటలను కొనుగోలు చేయాలి.
రైతు సేవా కేంద్రాల్లో యూరియా కొరత తీర్చాలి…సిపిఎం
సిపిఎం పార్టీ ప్రతినిధి బృందం నంద్యాల జిల్లా రుద్రవరం మండలంలో ని యల్లవత్తుల, చిన్నకంభలూరు ,నరసాపురం ,ఆలమూరు, శ్రీరంగాపురం గ్రామంలో పర్యటించి రైతాంగ సమస్యలను రైతులను అడిగి తెలుసుకున్నారు. బృందంలో సిపిఎం జిల్లా కార్యదర్శి టి.రమేష్ కుమార్ , సిపిఎం జిల్లా కార్యదర్శి సభ్యులు టి. రామచంద్రుడు, జిల్లా నాయకులు వి.బాల వెంకట్, రుద్రవరం మండల నాయకులు జి .శంకర్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి రమేష్ కుమార్ మాట్లాడుతూ ఏ గ్రామంలో చూసిన ఖరీఫ్ లో వరి పంట వేసినటువంటి రైతాంగం 75కేజీల వస్తా రూ,1300 నుండి రూ,1500 రూపాయల లోపు అమ్ముకొన్నా మని, ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర అమలు జరిగే విధంగా కొనుగోలు కేంద్రాలు నిర్వహించక పోవడం వల్ల తాము తీవ్రంగా నష్టపోయామనీ,కనీసం పెట్టుబడి కూడా రాలేదని సిపిఎం నాయకులకు రైతులు తెలిపారు. రై తాంగం వాడే అన్ని రకాల విత్తనాలు, ఎరువులు పురుగుమందులు, సేద్యపు ఖర్చులు, నూర్పిడి ఖర్చులు విపరీతంగా పెరగడానికి కారణమైన కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పండించిన పంటలకు మద్దతు ధరలు నిర్ణయించి, చట్టబద్ధత కల్పించి , వాటిని అమలు చేయకపోవడం వల్లనే రైతాంగం తీవ్రంగా నష్టపోయి, అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అన్నారు. అరకొర ప్రకటించిన మద్దతు ధరలను కూడా సకాలంలో అమలు చేయకపోవడం మూలంగా ప్రైవేట్ వ్యాపారుల దోపిడీకి రై తాంగం బలవుతున్నారు. ఇప్పటికీ ఆళ్లగడ్డ నియోజకవర్గంలో అత్యధికంగా వరి పంట తో పాటు మొక్కజొన్న మినుము, వేరుశనగ, లాంటి పంటలు పండిస్తుంటే కేవలం కంది కొనుగోలు కేంద్రాలు మాత్రమే ఏర్పాటు చేశారు. మిగిలిన ఏ ఒక్క పంట కూడా ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు. ఇప్పటికీ చాలా గ్రామా ల్లో వరి ధాన్యం నిలువలు ఉన్నాయని, ధరలు పెరుగుతాయని ఆశగా రైతాంగంఎదురుచూస్తున్నారు. కావున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే జోక్యం చేసుకొని ధాన్యం తోపాటు అన్ని రకాల పంటల మద్దతు ధరలను పెంచాలని వారు డిమాండ్ చేశారు. బస్తామూడు వేల రూపాయలకు ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నారు. అలాగే అలా ఎండుమిర్చి ధర 25 వేల కు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి గ్రామంలోని ప్రతి రైతు సేవ కేంద్రంలో పంటలకొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, ప్రతి కొనుగోలు కేంద్రం నుండి రైతులకు సరిపడా అన్ని రకాల ఎరువులు పురుగులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రుద్రవరం మండల వ్యాప్తంగా రైతు సేవ కేంద్రాల్లో యూరియా కొరత ఉన్నందువల్ల ప్రైవేట్ వ్యాపారస్తులు బస్తా రూ,400 రూపాయల వరకు అమ్ముకుంటూ రైతులను దోపిడీ చేస్తున్నారన్నారు. రైతుల కోసం కూటమి ప్రభుత్వం చెప్పిన సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదన్నారు. కావున 20వేల రూపాయల పెట్టుబడి సహాయ నిధిని వెంటనే ఇవ్వాలని, సంక్షేమ పథకాలన్నీ కౌలు రైతులకు గుర్తింపచేయాలని కోరారు.అలాగే సిరివెల్ల, చిన్న కంబలూరు మెట్ట మధ్యలో గల ఆర్ అండ్ బి రహదారిలోని గుంతలను పూడ్చి రోడ్డు వెయ్యాలని కోరారు. అలాగే ప్రతి గ్రామంలో పంట పొలాలకు వెళ్లే దారులను రోడ్లు మరమ్మతులు చేయాలన్నారు. రబీ సీజన్లో అయినా సకాలంలో అన్ని పంటలకు మద్దతు ధరలు పెంచి సకాలంలో కొనుగోలు చేయాలని కోరారు.
వరి ధాన్యం బస్తా రూ,3000 కు ప్రభుత్వమే కొనుగోలు చేయాలి
RELATED ARTICLES