భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
8-11-2024
దమ్మపేట మండలం గండుగులపల్లి గ్రామంలో జిసిసి ద్వారా వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే *జారె ఆదినారాయణ* ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు చేయాలని తరుగు విషయంలో రైతులను ఇబ్బంది పెట్టొద్దన్నారు. అలాగే రైతులు కూడా ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దని ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పిస్తుందని ప్రతి రైతు గమనించి జిసిసి కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యం విక్రయించాలని తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యానికి చెల్లింపులు కూడా త్వరగా అందేలా కృషి చేయాలని అధికారులకు సూచించారు..
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు..
వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జారె
RELATED ARTICLES