Tuesday, January 14, 2025

వరద బాధిత కుటుంబాలకు తొమ్మిది లక్షల విలువ గల నిత్యవసర కిట్లను  జెకె సీటి ట్రస్ట్ చైర్మన్ జమాల్ ఖాన్ నిత్యావసరాలు వితరణ

భారీ వర్షాలు తుఫానుల కారణంగా విజయవాడ నగరంలోని సింగ్ నగర్, దాబా కొట్టు సెంటర్. బాంబే కాలనీతో పాటుగా మరెన్నో ప్రాంతాలు ముంపుకు గురై జన జీవనం అతలాకుతలం అయింది. మీడియా మాధ్యమాల ద్వారా ప్రసార సాధనాల ద్వారా విషయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకున్న అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు డివిజన్ లోని నిమ్మలగూడెం గ్రామానికి చెందిన ప్రముఖ ఆయుర్వేద వైద్యులు మహమ్మద్ జమాల్ ఖాన్ తన సహచర సిబ్బందిని జమాల్ ఖాన్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులను సహాయంతో ప్రతి కుటుంబానికి ఐదు కేజీల బియ్యం, చింతపండు, ఉప్పు. పప్పు. కారం మంచి నూనె తోపాటుగా మంగళారంపలు కూరగాయలను కూడా చేర్చి 500 కిట్లను స్వయంగా తన ఆవరణలోనే తయారు చేయించారు. అనంతరం వాటిని వ్యానులు ఏర్పాటు చేసి తన అనుచర సిబ్బందితో శనివారం విజయవాడ నగరానికి చేరుకున్నారు. నగరంలోని కొలుత సింగ్ నగర్ షాది ఖానా వీధిలో 200 మంది నిర్వాసిత కుటుంబాలకు అలాగే డాబా కొట్టు సెంటర్ లో 100 కుటుంబాలు బాంబే కాలనీలో మరో వంద కుటుంబాలు సుందర్ నగర్ లో వంద కుటుంబాల మొత్తం 500 కుటుంబాల నిర్వాసితులకు తొమ్మిది లక్షల రూపాయల విలువ చేసే నిత్యవసరాలను జమాల్ ఖాన్  మరియు ట్రస్ట్ కార్యదర్శి కుమారుడైన ఇమ్రాన్ ఖాన్ చేతుల మీదుగా నిత్యవసరాలను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సింగ్ నగర్ షాది ఖానా కు చెందిన కొందరు నిర్వాసితులు మాట్లాడుతూ ఇంతవరకు ఈ ఒక్కరు కూడా తమ వద్దకు వచ్చి తమ సమస్యలను తెలుసుకొని ఇంటి వద్దకు వచ్చి సహాయం చేసిన సందర్భాలు ఏమీ లేవని ఎవరో తెలియదు మన్యప్రాంత ముంపు మండలాల్లో ఉంటున్న వ్యక్తి మీడియా మాధ్యమాల ద్వారా మా బాధలను చూసి చలించి ఇక్కడకు వచ్చి సహాయం అందించినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉందని వారి సహాయ సహకారాలు ఎప్పుడూ అందరికీ ఉండాలని కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కూనవరం మండల తెలుగుదేశం నాయకులు ఎడవల్లి భాస్కర్ మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారికి ఆపద్బాంధవుడిగా దీనవస్థలో ఉన్నవారికి దేవుడిలా ఏజెన్సీ మండలాలనే కాకుండా తమకు పరిశ్రమలు అయినటువంటి ప్రాంతం నిర్వాసిత నిర్భాగ్యులకు కూడా వందల కిలోమీటర్లు దూరం వచ్చి తన వంతు సాయం గా నిర్వాసితులకు నిత్యవసరాలు అందజేయడం చాలా గొప్ప విషయమని అలాంటి గొప్ప మనసు ఉన్న వ్యక్తి తో తాము కూడా వచ్చి సహకారాన్ని అందించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ప్రతి మనిషి తనకోసం ఈ సమాజం ఏమి చేసిందని ప్రశ్నించే కంటే తను సమాజం కోసం ఏమి చేశానని ఆత్మ విమర్శ చేసుకోవటమే మనిషి యొక్క నిజమైన నైతికత్వమని ఈ సందర్భంగా తెలిపారు. జమాల్ ఖాన్ మాట్లాడుతూ అన్ని జీవరాశుల్లో కల్లా మానవ జీవితం ఉన్నతమైందని ఆశయాలు కూడా ఉన్నతంగా ఉంటేనే ముందుకు వెళ్లడం జరుగుతుందని సాటి మనుషులు ఆపదలో ఉంటే తనకున్న సంపదలో వారికి మంచి కష్టాలను దూరం చేసే కనీస ధర్మం ప్రతి ఒక్కరూ పాటిస్తే ఈ ఒక్కరు కూడా మానవ సమాజంలో ఇబ్బందులకు గురికారు అని అన్నారు. జాతి మతకుల లింగ బేధం లేని నిస్వార్థమైన ప్రేమ కలిగి ఉండాలని దైవం దృష్టిలో సర్వ మతాలు సర్వ జీవరాసులు ఒక్కటేనని అందరికీ అవగాహన కలిగి ఉండాలన్నారు. తాను చేసిన ఈ చిరు సహాయం ఎంతో మందికి ఉపయోగపడుతుందని ఆ చిన్న ఆశతోనే రావటం జరిగింది. జరిగిన నష్టం ఎవరు ఎంత ఇచ్చినా తీర్చలేనిదని మానసిక క్షభ, చిరకాల గుర్తులు విలువైన వస్తువులు కళ్ళ ఎదుట వరదల్లో కొట్టుకుపోతుంటే ఆ బాధ అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుందని అన్నారు. అనంతరం బాధ్యత కుటుంబాలను ఓదారుస్తూ సహాయ కార్యక్రమాలను ముందుకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ జిల్లా సెంటర్ నాయకులు షేక్ గౌస్ బాషా, షేక్ సుభాని, నాగుల్ మీరా, తెలుగుదేశం వీఆర్పురం కూనవరం మండల నాయకులు ముత్యాల రామారావు , జెడ్పిటిసి వాళ్ళ రంగారెడ్డి,మాజీ జెడ్పిటిసి, రసూల్, శ్రీరామ్, పుట్టి రమేష్ బాబు, ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు కనితి మధు, వెంకన్న, సురేశ్, సూఫీ సర్ఫరాజ్ అలీ, జెకె సిటీ ట్రస్ట్ సభ్యులు జావేద్, రియాజ్, శేఖర్, తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular