TEJA NEWS TV
వరదయ్య పాలెం తిరుపతి జిల్లా
గ్రామీణ భారత్ బంద్ లో భాగంగా వరదయ్యపాలెం బస్టాండ్ నుండి ప్రదర్శన నిరసన కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్పొరేట్ కోటీశ్వరులకు కొమ్ముగాస్తు మత విదేశాలను రెచ్చగొడుతూ ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.రైతులకు కనీస మద్దతు ధర ప్రకటించకుండా రైతులకు నష్టం జరిగే విధంగా చట్టాలను తీసుకువస్తూ రైతుల ప్రాణాలతో చెలగాటమాడుతోంది అని వారు అన్నారు స్కీం వర్కర్లు అయినటువంటి అంగన్వాడి ఆశ మధ్యాహ్నం భోజనం కార్మికులకు పని భద్రత కల్పించి ఈఎస్ఐ పిఎఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు నిత్యవసర సరుకులు పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని నినాదాలు చేశారు ప్రజలందరూ ఓట్లు తోగెలిచిన ప్రధానమంత్రి మోడీ కొంతమంది కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తున్నారని ప్రజలను మాయమాటలతో వంచిస్తున్నారని దేశాన్ని నేతృత్వం వైపు తీసుకెళ్తున్నారని దీన్ని ప్రజలందరూ ఐక్యంగా ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఐ నుంచి చిన్ని రాజ్ సిద్ధలయ్య తరుణ్ కుమార్ ఏఐటీయూసీ నాయకులు చంద్ర మురళి బాల గురునాథం సిఐటియు నాయకులు శాంతి ధనుంజయులు తదితరులు పాల్గొన్నారు
వరదయ్యపాలెం: గ్రామీణ భారత్ బంద్ లో భాగంగా నిరసన కార్యక్రమం
RELATED ARTICLES