కాంభాకం గ్రామపంచాయతీని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యం – సర్పంచ్ బొగ్గల దీప
రెండు వాటర్ ట్యాంక్ లు మంజూరు కోసం ఎదురు చూపులు
తేజ న్యూస్, వరదయ్యపాలెం,
కాంబాకం సర్పంచ్ బొగ్గల దీప w/o నరేంద్ర ఎస్సీ రిజర్వేషన్ కోటాలో అతి చిన్న వయసులో కాంబాకం పంచాయతీ సర్పంచ్ గా ఎన్నికైన రికార్డును నెలకొల్పారు.గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని సంకల్పంతో తాను సర్పంచ్ బరిలోకి దిగినట్టు ఆమె తెలిపారు.
ఇందులో భాగంగా తిరుపతి జిల్లా, వరదయ్యపాలెం మండలం,కాంబాకం పంచాయతీలోని గోవిందప్ప రెడ్డి దరఖాస్తు, కాంబాకం గిరిజన కాలనీ,కాంబాకం, కాంబాకం హరిజనవాడ,రామిరెడ్డి పాలెం, అక్షంపాలెం, చెన్నవారిపాలెంలో కొంత భాగం కలిసి ఉన్న ఈ ప్రాంతానికి మొత్తం ఆరు బోర్లు ఏర్పాటు చేసి తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేశానని ఆమె తెలిపారు.
గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో లోక ఫౌండేషన్ సహాయ సహకారాలు అందుకుంటున్నామని చెప్పారు.వారి సహకారంతోనే పర్యావరణానికి హాని కలగనటువంటి విస్తరాకుల తయారీని పంచాయతీలో నెలకొల్పి కొంతమందికి ఉపాధి అవకాశాలను కల్పించామని చెప్పారు.గ్రామంలో తాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కరించడానికి రామిరెడ్డి పాలెం నందు ఒక వాటర్ ట్యాంకు,చెన్నవారిపాలెం నందు మరో వాటర్ ట్యాంకు ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని,ఇందుకు ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందుతుందని ఆశిస్తున్నామని ఆమె తెలిపారు.
అదేవిధంగా ప్రభుత్వము నుండి అందే పథకాలు అర్హులందరికీ అందేలా చూడడంలో సంబంధిత అధికారులు అందరికీ తాను తన వంతు తోడ్పాటు అందిస్తున్నానని ఆమె పేర్కొన్నారు.ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలు ఏర్పాటు కొనసాగుతుందని,అందులో కొన్ని ఇప్పటికి పూర్తయ్యే పరిస్థితుల్లో ఉన్నాయని,మిగిలినవి కూడా త్వరలో పూర్తి చేస్తే ప్రభుత్వ భవనాలతో పంచాయతీ కలకలాడుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
అనేక సంవత్సరాలుగా కాంబాకం గ్రామానికి సరైన రహదారి లేకపోవడంతో,స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం,అధికారులు,ఎంపీ గురుమూర్తి,రాష్ట్ర దేవాంగ కార్పొరేషన్ డైరెక్టర్ బొప్పన తిలక్ బాబు,జడ్పీటీసీ వెంకటేశ్వర్లు,ఎంపీపీ పద్మప్రియ,మరియు ముఖ్య నాయకుల సహకారంతో గ్రామానికి తారు రోడ్డు సౌకర్యం,చెన్నవారిపాలెం గ్రామంలో డ్రైనేజీ ఏర్పాటు, త్రాగునీటి సౌకర్యం కొరకు కృషి చేశామని తెలిపారు.
శ్రీకాళహస్తి రోడ్డు నుండి కాంబాకం గ్రామానికి వెళ్లే తారు రోడ్డు నందు కొంత దూరం అసంపూర్తిగా ఉన్న రోడ్డును కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి తాము కృషి చేస్తున్నామని తెలిపారు
ఇందుకు అధికారులు,నాయకులు కూడా చొరవ చూపాలని కోరారు.పంచాయతీని ఆదర్శ గ్రామంగా తీర్చి దిద్దేందుకు తన వంతు తాను కృషి చేస్తున్నానని ఎందుకు తన భర్త నరేంద్ర,మరియు స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిధుల సహాయ సహకారాలతో మున్ముందు మరిన్ని కార్యక్రమాలు చేపట్టడానికి కృషి చేస్తానని ఆమె తెలిపారు.ఈ సందర్భంగా వైస్ సర్పంచ్,వార్డు సభ్యులకు,తన కుటుంబ సభ్యులకు, గ్రామ ప్రజలకు సర్పంచ్ దీప ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
వరదయ్యపాలెం: కాంభాకం గ్రామపంచాయతీని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యం – సర్పంచ్ బొగ్గల దీప
RELATED ARTICLES