Friday, January 24, 2025

వరదయ్యపాలెం : ఎంపీ గురుమూర్తి ఆత్మీయ సమావేశం

TEJA NEWS TV : తిరుపతి జిల్లా వరదయ్యపాలెం విచ్చేసిన తిరుపతి ఎంపీ గురుమూర్తికి,దయాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు.వరదయ్యపాలెం ఎంపీడీఓ కార్యాలయంలోని సమావేశ మందిరంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి సమావేశం నిర్వహించారు.తనకు ప్రజలు కల్పించిన అవకాశం ద్వారా ప్రజల సమస్యలను పార్లమెంట్లో వినిపించి,సమస్యల పరిష్కారం కోసం అందివచ్చిన ప్రతి చిన్న అవకాశంను కూడా సద్వినియోగం చేసుకున్నానన్న తృప్తి తనకు ఉందని తెలిపారు.ప్రజలు తరపున ఈ అవకాశం కల్పించిన తిరుపతి పార్లమెంట్ ప్రజలకు,వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.రానున్న ఎన్నికలలో తనను సత్యవేడు నియోజకవర్గం సమన్వయకర్తగా భాద్యతలు అప్పగించారని,జగన్ మోహన్ రెడ్డి నిర్ణయంను తాను తూచ పాటించక తప్పదని,అందరూ సహాయ సహకారాలు అందించాలని కోరారు.త్వరలో తిరుపతిలోను,తాడేపల్లిలోను ముఖ్యమంత్రి నేరుగా మాట్లాడే అవకాశం ఉందని,అందుకు జగన్ అభిమానులు సిద్దంగా ఉండాలి అని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా మండలం లోని వైసీపీ నాయకులు శాలవాలతో సత్కరించారు.రాష్ట్ర దేవాంగ కార్పొరేషన్ డైరెక్టర్ బొప్పన తిలక్ బాబు,ఎంపీపీ భర్త దామోదర్ రెడ్డి,మండల,నియోజకవర్గం,జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular