వరదయ్యపాలెం 06 జులై 2024 ( తేజ న్యూస్ టీవీ )
సత్యవేడు ఎమ్మెల్యే కొనేటి ఆదిమూలం వరదయ్యపాలెం మండలంలో పర్యటించనున్నారు.
వరదయ్యపాలెం మండలం పాండూరు వెంకటేశ్వర గిరిజన కాలనీ కి చెందిన బుజ్జమ్మ పూరిల్లు షార్ట్ సర్క్యూట్ తో శనివారం దగ్దమైయ్యింది.సమాచారం అందుకున్న ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వెంటనే స్పందించి వరదయ్యపాలెం అధికారులను, అక్కడి నాయకులను అప్రమత్తం చేశారు.బాధిత బుజ్జమ్మ కుటుంబానికి బియ్యం, కూరగాయలు వంటి నిత్యావసర వస్తులు అందించడంతో పాటు రూ.3 వేలు తక్షణ సాయం క్రింద స్థానిక నాయకులు, అధికారులు ద్వారా పంపిణీ చేసేలా చర్యలు చేపట్టడం జరిగింది.వీటితో పాటు ఆదివారం ఉదయం 11 గంటలకు వరదయ్యపాలెం మండలం పాండూరు వెంకటేశ్వర గిరిజన కాలనీకి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం స్వయంగా చేరుకొని బాధిత కుటుంబాన్ని పరామర్శించనున్నారు.బాదిత కుటుంబానికి ప్రభుత్వ సాయం అందించి భరోసా కల్పించనున్నారు.ఈ కార్యక్రమానికి వరదయ్యపాలెం మండలం లోని ప్రజా ప్రతినిధులు, అధికారులు, తెలుగుదేశం, బిజెపి, జనసేన నాయకులు కార్యకర్తలు , పత్రికా విలేఖరులు పాల్గొనవలసిందిగా కోరడమైనది