TEJA NEWS TV :
సత్యవేడు నియోజకవర్గ వరదయ్యపాలెం మండలంలో ఈరోజు శుక్రవారం రెండు గంటలకు వరదయ్యపాలెం ఎంపీడీవో కార్యాలయం ఆవరణ వద్ద నందు నూతన పింఛన్లు పంపిణీ కార్యక్రమం మరియు పెంచిన ఇస్తున్న వైయస్సార్ పెన్షన్ కానుకను సత్యవేడు నియోజకవర్గ ఎమ్మెల్యే ఆదిమూలం లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమం లో భాగంగా ముఖ్యమంత్రి *శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు* అవ్వ తాతల వికలాంగుల వితంతువుల సంతోషమైన జీవితం గడపడమే లక్ష్యంగా వారి జీవన ప్రమాణంలో మార్పు తీసుకువచ్చే విధంగా వైయస్సార్ పెన్షన్ కానుకను నేడు ఇచ్చిన మాట ప్రకారం రూ. 3000 రూపాయలకు పెన్షన్ కానుకను రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున పంపిణీ చేయడం జరుగుతున్నదన్నారు.
వరదయ్యపాలెం ఎంపీపీ పద్మప్రియ భర్త దామోదర్ రెడ్డి,మాట్లాడుతూ పెన్షన్ కానుక పథకంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ వరకు పెన్షన్ సొమ్మును పెంచుతూ పోయినట్టు గుర్తు చేశారు.అలాగే రేషన్ కోసం రేషన్ షాపుల వద్ద పడి కాపులు కాకుండా ఇండ్ల వద్దకే డోర్ డెలివరీ విధానాన్ని ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. ఆసరా,చేయూత వంటి వినూత్న పథకాలు అమలు చేయడం వల్ల అర్హులందరూ లబ్ధి పొందుతున్నట్టు ఆమె చెప్పారు.వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ నాయుడు దయాకర్ రెడ్డి, మాట్లాడుతూ మేనిఫెస్టోను పూర్తిగా అమలు చేసిన ఘనత సీఎం జగన్ మోహన్ రెడ్డికి దక్కిందన్నారు.ఆంధ్ర రాష్ట్రంలో అందిస్తున్న 3000 రూపాయలు పెన్షన్ సొమ్ము ఇతర రాష్ట్రాల్లో లేదన్నారు.తదనంతరం పలువురు నూతన లబ్ధిదారులకు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం,స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి పెన్షన్ సొమ్ము అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలోశ్రీకాళహస్తి బోర్డ్ మెంబర్ పెద్దిరెడ్డి మల్లికార్జున రెడ్డి, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ నాయుడు దయాకర్ రెడ్డి,వైస్ ఎంపిపి బొప్పన పద్మావతి,జెడ్పీటీసీ వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్ చిన్నా, వినోద్ యాదవ్, యస్ సి సెల్ కన్వీనర్ బందిల సురేష్, పాల సుబ్రమణ్యం రెడ్డి, సర్పంచ్ ల సంఘం అధ్యక్షుడు చంద్ర రెడ్డి, సర్పంచులు,దుడ్డు వేణు,వీరభద్రం,జ్యోతి, పాండురు ఎంపిటిసి , చిన్న పాండురు శ్యామల సుబ్రమణ్యం, తొండురు రమణయ్య, శివ, ఎంపిడిఒ సుబ్రమణ్యం రాజు, తహశీల్దార్ గౌరీ శంకర్, సింగిల్ విండో ప్రెసిడెంట్ హరిబాబు రెడ్డి,si నాగార్జునరెడ్డి, ASI షన్ముగం, సాయిబాబా, సీనియర్ అసిస్టెంట్ మురళి కృష్ణ,చిరంజీవి, వక్ఫ్ బోర్డు అబ్దుల్లా, సర్పంచ్ జ్యోతీ, కాంబాకమ్ సర్పంచ్ దీప, శ్రీధర్ రెడ్డి సచివాలయం సిబ్బంది , వాలంటీర్స్ మరియు గృహ సారథులు, పాల్గొన్నారు..
వరదయ్యపాలెం : ఇచ్చిన మాట ప్రకారం నేడు పెంచి ఇస్తున్న పెన్షన్
RELATED ARTICLES