తేజ న్యూస్ టి వి సంగెం మండల ప్రతినిధి. వి. నాగరాజు.
వరంగల్ మహానగర పాలక సంస్థ 16వ డివిజన్ ధర్మారం కి చెందిన మాదారపు.వేణుమాధవ్ మరియు వారి కుమారుడు ఇద్దరూ ఇటీవల అనారోగ్యానికి గురి కావడంతో వారు హైదరాబాద్ లోని హాస్పిటల్ లో చికిత్స పొందుతుండగా వారిని పరామర్శించి తక్షణ సహాయం కోసం *(10000, రూపాయలు* ) ఆర్థిక సహాయం చేసిన మన స్థానిక *కార్పొరేటర్ సుంకరి.మనీషా శివకుమార్*
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపదలో వున్న నన్ను నమ్ముకుని వున్న ప్రతి ఒక్కరికీ నాకూ తోచినంతలో సహాయం చేయడం నా లక్ష్యం ,అదేవిధంగా మాదారపు.వేణుమాధవ్ పేద వైశ్య కుటుంబానికి చెందిన వారు అలాంటి వారికి ఇలా ఒకేసారి తండ్రి కొడుకు ఇద్ధరు అనారోగ్యానికి గురికావడం చాలా బాధాకరం.పుట్టెడు దుఃఖంలో ఉన్న వారి కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి నేనున్నాను అంటూ కొంత మనోధర్యం నింపడం జరిగింది. వైద్య ఖర్చులు భరించలేని స్థితిలో ఆ కుటుంబం ఉంది.కావున దయచేసి దాతలు ముందుకు వచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా కోరారు.ఎవరైనా వారికి ఆర్థిక సహాయం చేసే వారు ఈ క్రింది నంబర్ కు ఫోన్ పే గానీ గూగుల్ పే చేయగలరు..
మాధారపు.వేణుమాధవ్
Cell: *90146 74308*
Phone pay..or…Google pay
వరంగల్: నేనున్నాను అంటూ మానవత్వం చాటుకున్న కార్పొరేటర్ సుంకరి, మనిషా-శివకుమార్
RELATED ARTICLES