కె .వి .ఎం. ఎస్. సి. బి. ఓ. ఆధ్వర్యంలో యన్టీఆర్ జిల్లా వత్సవాయి ప్రైమరీ హెల్త్ సెంటర్ నందు మీకు తెలుసా కార్యక్రమం ద్వారా హెచ్ఐవి. ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమం జరిగింది . ప్రతి ఒక్కరు ఎయిడ్స్ రహిత సమాజo కోసం కృషి చేయాలి ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం నందు ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశాల మేరకు ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ కె. వి ఎం. ఎస్ . స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన మీకు తెలుసా కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా Dr .V. సీతారాం హాజరయ్యారు . ఈ కార్యక్రమం గురించి ప్రాజెక్టు మేనేజర్ మాట్లాడుతూ హెచ్ఐవి. ఎలా వ్యాధి ఎలా వస్తుంది? ఎలా వ్యాప్తి చెందదు హెచ్ఐవి. రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వివిధ అంశాల గురించి ఆయన తెలియజేశారు. అలాగే హెచ్.ఐవి. వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షత చిన్నచూపు చూడకుండా సమాజంలో కలిసిమెలిసి జీవించే విధంగా సహకరించాలని ఆయన కోరారు. సుఖ వ్యాధులు యొక్క వివరాలను తెలియజేశారు . 2017 ఎయిడ్స్ యాక్ట్ గురించి కూడా వివరించారు . అలాగే టోల్ ఫ్రీ నెంబర్ 1097 గురించి కూడా తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు డైరెక్టర్ షిబా మరియు ప్రాజెక్టు మేనేజరు తదితర సిబ్బంది పాల్గొనడం జరిగింది .
వత్సవాయి ప్రభుత్వ వైధ్యశాల లో హెచ్.ఐ.వి. ఎయిడ్స్ పై అవగాహన సదస్సు
RELATED ARTICLES