ఇటీవల కాలంలో జిల్లా పోలీసులు ఎదుట లొంగిపోయిన నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులతో పాటు మరో ఏడుగురు మలేషియా కమిటీ సభ్యులకు ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన చెక్కులను అందజేశారు.
ప్రభుత్వం తరఫున అందవలసిన అన్ని రకాల ప్రతిఫలాలను లొంగిపోయిన మావోలకు అందేలాగా పోలీస్ శాఖ అన్ని విధాలుగా కృషి చేస్తుందని జిల్లా ఎస్పీ అన్నారు. మావోయిస్టులు కేవలం తమ ఉనికి కోసమే అమాయకులైన గిరిజనులను బలవంతంగా పార్టీలోకి చేర్చుకుంటున్నారని బాహ్య ప్రపంచానికి కనబడకుండా వారిని నిరక్షరాశులుగా చేస్తూ అంధకారంలోకి నెట్టేస్తున్నారని వారు చెప్పుకొచ్చారు. అంతేకాకుండా లొంగిపోయి సాధారణ జీవితం గడపాలనుకునే మావోయిస్టు పార్టీకి చెందిన సభ్యులు పోలీసులను చూసి భయపడద్దని లొంగిపోవాలనిపిస్తే బంధుమిత్రుల ద్వారా గాని, పోలీస్ స్టేషన్లో గాని, అధికారుల వద్ద గాని నేరుగా లొంగిపోవాలని ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ పారితోష్ పంకజ్ ఐపీఎస్, భద్రాచలం ఏ ఎస్ పి అంకిత్ కుమార్, సంక్వార్ ఐపీఎస్, దుమ్ముగూడెం సిఐ అశోక్, ఎస్సై వెంకటప్పయ్య, తదితరులు పాల్గొన్నారు.
లొంగిపోయిన దళ సభ్యులకు రివార్డులు అందజేత
RELATED ARTICLES