*సంగెం మండలం కే నిలువెత్తు నిదర్శనం*
*రావుల లహరి సివిల్ కానిస్టేబుల్ కు ఘనంగా సన్మానం.*
*కందగట్ల కళావతి నరహరి*
*తేజ న్యూస్ టివి ప్రతినిధి సంగెం. వి. నాగరాజు.*
సంగెం మండల కేంద్రంలో సోమవారం రోజున రావుల లహరి సివిల్ కానిస్టేబుల్ కు పువ్వుల బోకే, శాలువాతో ఘనంగా సన్మానం చేసి మాట్లాడుతూ కందగట్ల కళావతి నరహరి కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు ఒక ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే ఎన్నో కష్టాలను ఎదుర్కొంటము అలాంటిది మన మండలం లో ఒకే ఇంట్లో రెండు ఉద్యోగులు రావడం మనకు అలాగే మండలానికి నిలువెత్తు నిదర్శనం రావుల లహరి నరేష్ సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించి నేటి యువతి, యువకులకు ఆదర్శంగా నిలుస్తున్న రావుల లహరి నరేష్ సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించడం. తల్లిదండ్రులకు, గురువులకు, అత్తమామలకు, గ్రామానికి, మండలానికి ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మెట్టుపల్లి మల్లయ్య, సెర్ఫ్ సిసి, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ బొజ్జ సురేశ్, పులి రాజశేఖర్,సెర్ఫ్ వివో ఏలు మేడి విజయ, ఆగపాటి సుమతి, మాంకాల ప్రభాకర్, గ్రామ సంఘం అధ్యక్షురాలు తండా రాజమణి తదితరులు పాల్గొన్నారు.
రావుల లహరి సివిల్ కానిస్టేబుల్ కు ఘనంగా సన్మానం
RELATED ARTICLES