తేజ న్యూస్ టివి ప్రతినిధి సంగెం
సంగెం గ్రామానికి చెందిన రావుల సూరయ్య విజయ దంపతుల చిన్న కుమారుడు రావుల క్రాంతి 2022 సంవత్సరంలో పోలీస్ నోటిఫికేషన్ కి అప్లై చేసి టెక్నికల్ పోస్టులో భాగంగా పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గానేషన్లో కానిస్టేబుల్ గా ఉద్యోగం సాధించారు. ఏప్రిల్ ఒకటవ తేదీన రావుల క్రాంతికి ఉద్యోగం రావడం జరిగింది.
అందులో భాగంగా పులి రాజశేఖర్ ఉద్యోగం సాధించిన రావుల క్రాంతి ఇంటి వద్దకు వెళ్లి అభినందనలు తెలిపి శాలువతో వారిని వారి తల్లిదండ్రులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పులి రాజశేఖర్ మాట్లాడుతూ మన గ్రామం నుండి ప్రభుత్వ ఉద్యోగం సాధించడం చాలా ఆనందకరమైన విషయం వీరిని స్ఫూర్తిగా తీసుకొని మిగతా విద్యార్థిని, విద్యార్థులు కూడా మంచి పట్టు దలతో చదవలని తలిదండ్రుల కళ్ళల్లో ఆనందం కలిగించే విధంగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి రేపటి తరం వారికి ఆదర్శంగా నిలువాలని పులి రాజశేఖర్ కోరారు.
రావుల క్రాంతి ని ఘనంగా సన్మానించిన పులి రాజశేఖర్
RELATED ARTICLES