తమిళనాడు బీజేపీ నాయకులు తమిళనాడు లోని రాయపురం జిల్లా వాణిజ్య విభాగం జిల్లా కన్వీనర్ కె బాల గురుదేవ్ – విజయలక్ష్మి దంపతులకు(కె బి జి కళ్యాణ మండపం అధినేత వరదయ్య పాలెం) వరదయ్య పాలెం మండలం బీజేపీ మండల అధ్యక్షులు వేలూరు పురుషోత్తం ఆధ్వర్యంలో నాయకుల సమక్షంలో ఘన సత్కారం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకొని పోవడం ,అత్యధిక యంపి సీట్లు గెలుపే లక్ష్యంగా పని చేసి మూడవసారి ముచ్చటగా మోదీ గారిని ప్రధానమంత్రిగా గెలిపించుకోవాలి అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఓబీసీ సెల్ కో కన్వీనర్ టి సిద్దలయ్య, రాష్ట్ర మహిళా మోర్చా మాజీ ప్రధాన కార్యదర్శి పి సుబ్బరత్నమ్మ,జిల్లా యస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి బి వాసు,జిల్లా యువ మోర్చా కార్యదర్శి కె ఢిల్లీ ప్రకాష్, మండల ఉపాధ్యక్షులు బి సుబ్రమణ్యం, మండల యస్సీ మోర్చా అధ్యక్షులు బి యేసు, మండల కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి యం రాంబాబు, కార్యదర్శి యం జయంత్ కుమార్.మండల ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి సి సూర్య, మండల యువ మోర్చా ఉపాధ్యక్షులు పి విక్కి,నాయకులు శివకుమార్,మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
రాయపురం జిల్లా వాణిజ్య విభాగం జిల్లా కన్వీనర్ దంపతులకు ఘన సత్కారం
RELATED ARTICLES