తేజ న్యూస్ టివి ప్రతినిధి
హైదరాబాద్ లో శనివారం రోజు
గాంధీ భవన్ లో రాజ్యాంగం రక్షణే మా దీక్షా అంటూ దీక్షకు పూనుకున్న తెలంగాణ రాష్ట్ర ఎస్సీ సెల్ చైర్మన్ మరియు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నగరి , ప్రీతం ముఖ్యఅతిధిగా నేషనల్ ఎస్సీ సెల్ చైర్మన్ రాజేష్ లిలోతియా, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తెలంగాణ రాష్ట్ర బీసీ సెల్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు హనుమకొండ జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు భారత రాజ్యాంగాన్ని మారుస్తా అంటూ వ్యాఖ్యలు చేశారు వారికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పి వారిని మార్చేసి ప్రజలే వారిని ఇంటికి పంపించారు ఈనాడు బిజెపి పార్టీ 400 సీట్లు గెలిపిస్తే భారత రాజ్యాంగాన్ని వారి ప్రచారంలో భాగంగా చెప్పుకుంటూ వస్తున్నారు భారత రాజ్యాంగం అనేది పేద బడుగు బలహీన వర్గాలకు ఒక ఆయుధం లాంటిది వారు బతకాలంటే ఆ రాజ్యాంగం అనే ఆయుధం పేద ప్రజల చేతిలో ఉండాలి భారత రాజ్యాంగాన్ని మారిస్తే పేద బడుగు బలహీన వర్గాల వారిని ఎవరు చూసుకోవాలి పేదవాడు ఇంకా పేదవాడిగానే ఉండాలా ధనవంతుడు ఇంకా ధనవంతుడు కావాలా భారత రాజ్యాంగాన్ని మారిస్తే ఎన్ని ఘోరాలు జరుగుతాయో ఎన్ని విద్వాంసాలు సృష్టించబడతాయో మీకు తెలియదు భారత రాజ్యాంగాన్ని మార్చే హక్కు మీకు ఎవరు ఇచ్చారు భారత రాజ్యాంగాన్ని మారుస్తా అనే విషయాన్ని మీరు పదేపదే చెప్తున్నారు బిఆర్ఎస్ కు తగిన గతి మీకు పడుతుందని కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావడం ఖాయమని మోడీ ఇంటి ముఖం పట్టడం సత్యమని కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త ఎస్సి, ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలు అందరూ కలిసికట్టుగా ఈ దీక్షను విజయవంతం చేశారని భారత దేశంలో ఇక మీ ఆటలు చెల్లభవని కేసీఆర్ ఇంటికి పరిమితమైనట్టుగా బిజెపి పార్టీ నాయకులు ఇంటికి పరిమితమైతారని మీరు భారత రాజ్యాంగం జోలికి వస్తే ఒక యుద్ధమే జరుగుతుందని తెలియజేశారు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నగరిగరి ప్రీతం వారు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదని రాజ్యాంగం రక్షణే మా దీక్ష అంటూ ఆ దీక్షకు ప్రీతం గారు ప్రతి ఒక్క నాయకులను కార్యకర్తలను పిలుపునిచ్చి ఈ దీక్ష విజయవంతమై నందు కు చాలా సంతోషం అంటూ రామకృష్ణ తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు గజ్జెల కాంతం సతీష్ మాదిగ మానవతారోయ్ బోనాల నగేష్ , ఓ యు ,జేఏసీ తదితరులు పాల్గొన్నారు.
రాజ్యాంగాన్ని మనం కాపాడుకుంటే ఆ రాజ్యాంగం మనల్ని కాపాడుతుంది :డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ
RELATED ARTICLES