TEJA NEWS TV
హనుమకొండకు మంగళవారం రోజు విచ్చేయుచున్న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో *సొసైటీ చైర్మన్ వేల్పుల కుమారస్వామి, సంగెం మండలం మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు గుండేటి బాబు, మండల మాజీ సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షుడు ఇజ్జగిరి స్వప్న అశోక్ ను* ముందస్తు అరెస్టు చేయడం జరిగిందని. సంగెం ఎస్ఐ ఎల్, నరేష్ తెలిపారు,
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2014 సెప్టెంబర్ 9న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తొలిసారి వరంగల్ నగరానికి వచ్చి కాళోజీ కళాక్షేత్రం భవన నిర్మాణం కోసం భూమి పూజ చేయడం జరిగిందని, బీఆర్ఎస్ పాలనలో నిర్మితమైన కాళోజి కళాక్షేత్రానికి కాంగ్రెస్ సర్కార్ రంగులు వేసి రిబ్బన్ కట్ చేయడం సిగ్గుచేటని, ఎన్నికల ముందట వరంగల్ రైతు డిక్లరేషన్ పేరిట గొప్పలు చెప్పి ఇప్పుడు రైతుబంధు, రుణమాఫీ, కౌలు రైతుకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని, ప్రజా పాలన అని చెప్పి అరెస్టులు చేయడం జరుగుతుందని, ఎన్నికల అప్పుడు ఆరు గ్యారెంటీలు అని అధికారంలోకి వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసేదాకా ప్రశ్నిస్తూనే ఉంటామని అన్నారు.
మీ అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదు – సంగెం సొసైటీ చైర్మన్,మాజీ సర్పంచుల అరెస్టు
RELATED ARTICLES