తేజ న్యూస్ టివి ప్రతినిధి.
భక్తుల రద్దీకి అనుగుణంగా సౌకర్యాలు కల్పించాలని పరకాల శాసనసభ్యులు ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అధికారులను ఆదేశించారు సారలమ్మ రాక సందర్భంగా ఆత్మకూరు మండలంలోని అగ్రం పహాడ్ మినీ మేడారంగా పిలవబడే సమ్మక్క సారలమ్మ జాతరలో భక్తులు వివిధ గ్రామాల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవార్లకు భక్తిశ్రద్ధలతో నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేపట్టిన అభివృద్ధి పనులను పరకాల శాసనసభ్యులు ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి స్వయంగా పరిశీలించారు భక్తుల రద్దీకి అనుగుణంగా మెరుగైన సౌకర్యాలు కల్పించాలని భక్తులు ఎవరు ఇబ్బంది పడకూడదని ఈ సందర్భంగా అధికారులు ఆదేశించారు.
అంతకుముందు ఆగ్రంపాడు గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేను జాతర కమిటీ, ఆలయ పూజారులు ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి కి పెద్ద ఎత్తున స్వాగతం పలికి గద్దెల వద్దకు తీసుకొని వెళ్లారు అనంతరం పూజలు నిర్వహించారు.
మినీ మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే రేవూరి
RELATED ARTICLES