నేషనల్ ఛాంపియన్షిప్ 2024-25 నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి మా విద్యార్థి రెండొవ స్థానం గెలుచుకోవడం మాకు గర్వ కారణం – కరెస్పాండంట్ చిట్టి బాబు
విద్యార్థులందరు చదువుపట్ల మాత్రమే కాక అన్ని రంగాలలో ముందంజ వెయ్యాలి – ప్రిన్సిపాల్ ఎలియాజర్ పల్లిపట్టు
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం నందు గల రెయిన్బో పాఠశాల నందు చదువుతున్న నిశాంత్ రెడ్డి తేదీలలో జరిగిన నేషనల్ స్థాయి పోటీలలో గెలుపొంది రెండొవ స్థానం గెలిచాడు. 26 డిసెంబర్ నుండి 29 డిసెంబర్ వరకు సేట్. ఎం ఆర్ జైపూరియా గోల్ క్యాంపస్ లక్నౌ, ఉత్తర్ ప్రదేశ్ నందు జరిగిన ఈ పోటీలలో మొదటి స్థానం లో కర్ణాటకాకు దక్కగా రెండొవస్థానం ఆంధ్రప్రదేశ్ కు దక్కింది. మూడోవా స్థానం ఉత్తర ఖండ్ కు దక్కింది. ఈ సందర్బంగా కరెస్పాండంట్ చిట్టి బాబు మాట్లాడుతూ ఇది కేవలం తల్లిదండ్రుల ప్రోత్సాహం మరియు ఇది విద్యార్థి యొక్క శ్రద్ధ అని కొనియాడారు. దేశం స్థాయి పోటీలలో మా విద్యార్థి రెండొవ స్థానం గెలవడం చాలా గర్వాంగా ఉందన్నారు. ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ రెయిన్బో విద్యార్థులు చదువు పట్ల మాత్రమే కాక వ్యాయామం, ఆటలు ఇలా అన్నిరకాలుగా తమ విద్యార్థులను తీర్చిదిద్దున్నామని అన్నారు. రాబోవు రోజులలో చెస్, కరాటే లాంటి వాటిల్లో కూడా తమ విద్యార్థులు ప్రతిభను కనుపరుస్తారాని ధీమా వ్యక్తం చేశారు. విద్యార్థులందరు విద్యారంగంలో మాత్రమే కాక ఆటలకు కూడా ప్రాముఖ్యత ఇచ్చి ఆటల పోటీలలో ముందంజ వెయ్యాలని కోరారు
మా విద్యార్థి రెండొవ స్థానం గెలుచుకోవడం మాకు గర్వ కారణం
RELATED ARTICLES