

తేజ న్యూస్ టివి ప్రతినిధి
కేంద్ర ప్రభుత్వం – హైదరాబాదు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (HIAL) మధ్య ఒప్పందం :
హైదరాబాద్ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మించేటప్పుడు కేంద్రంతో… హైదరాబాదు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (HIAL) సంస్థ చేసుకున్న ఒప్పందంలోని క్లాజ్ 5.2 లో 25 సంవత్సరాల లోపల, 150 కిలోమీటర్ల పరిధిలో ప్రస్తుతం అందుబాటులో ఉండి అభివృద్ధి చేసేవి మరియు మరో కొత్త దేశీయ/అంతర్జాతీయ విమానాశ్రయానికి అనుమతించరాదని ఆనాడు HIALకేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. దీంతో ఈ పరిధిలో రాష్ట్రంలో ఇప్పటి వరకు మరో ఎయిర్ పోర్టు నిర్మాణం జరగలేదు.
అయితే, రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు అభ్యర్ధన చేయగా HAIL తన బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఏర్పాటు చేసుకొని వరంగల్ జిల్లా మామునూర్ లో విమానాశ్రయ అభివృద్ధికి అంగీకారం తెలిపింది.