తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం లోని పాండురు గ్రామం లోని మామిడి తోటలను సత్యవేడు ఉధ్యాన శాఖ అధికారి ఆర్ రాధారాణి పరిశీలించారు. మామిడి తోటలలో పూత అన్ని చెట్లలో సమానంగా రావడానికి మరియు ఆడపూత శాతం పెంచడానికి పోటాషియం నైట్రేట్ (13.00.45)10 గ్రా ఒక లీటరు నీటికి మరియు బోరాన్ 2 గ్రా ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.తేన మంచు పురుగుల నివారణ కొసం బుప్రోఫెజిన్ +ఎసిఫేట్ 1గ్రా ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి లేదా వేప నూనె 1500 పిపియమ్ 3 మి.లీ.లేదా కానుగ నూనె10 మి.లీ.ఒక లీటరు నీటికి కలిపి చెట్ల మెదల్ల నుంచి చెట్టు మెత్తం తడిచేవిదంగా పిచికారి చేసుకోవాలి,అదేవిధంగా తెగుళ్ల నివారణ కోసం హెక్సాకోనజోల్ 2 మి.లీ.మాంకోజెబ్ 2.5 గ్రా ఒక లీటరు నీటికి చెట్ల మెదల్ల నుంచి చెట్టు మెత్తం తడిచేవిదంగా పిచికారి చేసుకోవాలి అని సత్యవేడు ఉధ్యాన శాఖ అధికారి ఆర్ రాధారాణి తెలియజేశారు.
మామిడిలో సస్య రక్షణ చర్యలు చేపట్టండి :ఉధ్యాన శాఖ అధికారి రాధారాణి
RELATED ARTICLES