Teja News TV శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బంద్ చేస్తుండగా వారిని అరెస్ట్ చేసి 1వ పట్టణ స్టేషన్ కు పోలీసులు తరలించారనీ వారికి సిపిఐ పార్టీ నాయకులు పోలీస్ స్టేషన్ కి వెళ్లి సంఘీభావం తెలిపినట్లు
సిపిఐ పట్టణ కార్యదర్శి కనిశెట్టిపల్లి వినోద్ కుమార్, పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నియంతలా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్ష పార్టీలకు, ప్రజా సంఘాలకు, నిరసన తెలిపే హక్కు లేదా ముఖ్యమంత్రి రాజ్యాంగ హక్కులను కాల రాస్తున్నారని అని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి ఇస్మాయిల్, సీనియర్ నాయకులు బాబు, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, సిపిఐ పట్టణ నాయకులు మారుతి రెడ్డి, నరసింహులు, తదితరులు పాల్గొన్నారు.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండించిన సిపిఐ నాయకులు
RELATED ARTICLES