TEJA NEWS TV
వరదయ్యపాలెం మండలం తిరుపతి జిల్లా
వరదయ్యపాలెం మండలం ఆంబూరు పంచాయతీ నందు తుఫాను ప్రభావం వల్ల సర్వం కోల్పోయిన వరద బాధితులకు ప్రభుత్వం అందజేయనున్న ఆర్థిక సహాయం నమోదు కార్యక్రమం పలు అనుమానాలు తావిస్తోంది. వరద బాధితులకు సర్వే అంతా అయోమయంగా మారింది. తుఫాన్ వరదల వల్ల అంబూరు పంట పొలాలు ఇళ్ళు మునిగిన ప్రాంతాల్లో సర్వే నిర్వహించి 152, మంది నమోదు చేసిన సచివాలయ సిబ్బంది ఆర్థిక సహాయం మాత్రం 28 మంది రైతులకు ఆర్థిక సహాయం అందుతునట్లు అధికారులు చెబుతున్నారు ఉన్న కొంతమంది రైతుల వారి పేర్లు మాత్రమే సర్వేలో ప్రధానంగా నమోదు చేయడంపై నిజమైన వరద బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారి తమకు సానుకూలంగా ఉన్న వారి పేర్లు మాత్రమే సర్వే లిస్టులో నమోదు చేయడం ఎంతవరకు సమంజసమని బాధితులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా అడిగిన వారి మీద అధికారి దురుసు ప్రవర్తన చాలా బాధ కలిగించిది సర్వం కోల్పోయిన వరద బాధితులకు అధికారులు నిర్వహించిన సర్వే మరింత బాధను కలిగిస్తోంది.
28 మంది రైతులే వరద బాధితులంటూ అధికారులు చెప్పడం నిజమైన వరద బాధితులను మరింత ఆగ్రహానికి గురి చేస్తోంది. వరదయ్యపాలెం మండలం. పరిధిలోని
ఆంబూరు గ్రామం వరద ముంపుకు గురైంది ఈ క్రమంలో క్షేత్ర స్థాయిలో . అధికారులు సైతం వారే నిజమైన వరద బాధితులుగా గుర్తిస్తున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.ఇది ఇంత జరుగుతున్న ఎమ్ ఆర్ ఒ గ్రామాలలో పర్యటించక పోవడం కారణం గా పలు అనుమానాలకు దారితీస్తుంది దీని మీద పై అధికారిలు ద్రుష్టి పెట్టి నిజమైన వరదబాధితులకు న్యాయం చేయాలనీ గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు
మరదవాడ సచివాలయం పరిధి లోని ఆంబూరు పంచాయతీ లో అసలైన వరద బాధితులకు అన్యాయం
RELATED ARTICLES