పుంగనూరు నియోజకవర్గం,పులిచెర్ల మండలం, కే కొత్తపేట కు చెందిన కీర్తిశేషులు షేక్ అజీద్ భాష ఆంజనేయుడు భక్తుడు, అదే కోవలో తన పిల్లలు చాంద్ బాషా, ఫిరోజ్ భాష కూడా నిత్యం ఆంజనేయ స్వామికి పూజలు చేసేవారు. అల్లా అయినా ఆంజనేయుడైన ఒక్కటే అన్న తన తండ్రి సిద్ధాంతాన్ని గట్టిగా నమ్మి కొత్తపేట గ్రామంలో
సప్తమందిర సముదాయం (వెంకటేశ్వర స్వామి, హనుమాన్, వినాయకుడు, శివాలయం, కామాక్షి అమ్మవారు, నవగహలు )ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కానీ మందిరం పూర్తికాకుండానే అజీద్ బాషా స్వర్గస్తులైనారు. తధాంతను ఆ ఆలయ నిర్మాణ బాధ్యతలు తమ కుమారులు చాంద్ భాషా, ఫిరోజ్ బాషా వీరి కుటుంబాలు కలిసి స్వీకరించి ఏడు దేవత మూర్తుల ఆలయాన్ని నిర్మించారు. అందులో భాగంగా మహా శివరాత్రి వేడుకలు మరియు, అన్నదానము, కోలాటాలు భజనలు వంటి కార్యక్రమలు జరుపుకున్నారు.
స్వామివారి కృప కటాక్షం పొందడం ఆ కుటుంబానికి పూర్వజన్మ సుకృతం అని ముస్లిం సోదరులు అన్నారు. ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామస్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
హిందూ ఆలయం నిర్మిస్తున్నారని వీరిని మతం నుంచి బహిష్కరించిన వైనం:
తమ తండ్రి అజీద్ భాషా చనిపోతే దహన క్రియలకి అడ్డుకున్న మత పెద్దలు, వేరే ఊర్లో దహన క్రియలు చేసిన పరిస్థితులు అయినా హిందూ సనాతన ధర్మం పట్ల ఇష్టం తో దృఢ సంకల్పంతో తండ్రి ఆశయాన్ని చాంద్ బాషా, ఫిరోజ్ భాష నెరవేర్చారు. దీంతో కులాలు, మతాలకు అతీతంగా అందరి ప్రశంసలను ఈ సోదరులు పొందుతున్నారు.
మత సామరస్యానికి ప్రతీకగా మహా శివరాత్రి వేడుకలు జరుపుకున్న ముస్లిం సోదరులు
RELATED ARTICLES