Friday, July 4, 2025

బ్రెయిన్ స్ట్రోక్ బాధితురాలికి వసుధ చేయూత

భద్రాచలం కు చెందిన హోంగార్డు ఎం. సత్యనారాయణ సతీమణి , బ్రెయిన్ స్ట్రోక్ డిబాధితురాలు ఎం రమ కు వసుధ ఫౌండేషన్  చేయూతనందించింది. అత్యవసరంగా ఆమెకు చికిత్స కోసం వసుధ ఫౌండేషన్ ను  ఆర్థిక సహాయం అందించాలని కోరారు. ఇందుకు వసుధ ఫౌండేషన్ చైర్మన్ మంతెన వెంకట రామరాజు సానుకూలంగా స్పందించి రూ. 10,000 చెక్ రూపంలో అందించాలని వసుధ ఫౌండేషన్ ఉమ్మడి జిల్లా కన్వీనర్ వేగేశ్న శ్రీనివాస రాజును కోరారు. ఈ క్రమంలో కు ఇందుకు సంబంధించిన చెక్కును  ఆమె భర్త హోంగార్డు సత్యనారాయణ కు భద్రాచలం ఏ ఎస్ పి విక్రాంత్ కుమార్ సింగ్ చేతుల మీదుగా శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఏ ఎస్ పి విక్రాంత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ ఏజెన్సీలో విద్యా వైద్య రంగాలకు వసుధ ఫౌండేషన్ అందిస్తున్న సేవలు అభినందనీయం అన్నారు. భవిష్యత్తులో సైతం  ఇటువంటి సేవలను మరింతగా కొనసాగాలని ఆకాంక్షించారు.  బ్రెయిన్ స్ట్రోక్ బాధితురాలు  రమ కు వసుధ ఫౌండేషన్ ఇప్పటికే రూ.20 వేలు చికిత్స కోసం అందజేయగా రెండో విడతగా రూ 10 వేలు ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో వసుధ ఫౌండేషన్ ఉమ్మడి జిల్లా కన్వీనర్ వేగేశ్న శ్రీనివాసరాజు, సభ్యులు పివీ సత్యనారాయణ, ఎస్కే  షరీఫ్ పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular