*ఆత్మహత్యల నివారణకై నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్,(బెంగళూరులో) ఏర్పాటు చేసిన కార్యశాల కి ఎంపిక అయ్యి ఒక్క రోజు శిక్షణ పూర్తి చేసుకున్న బీబీపెట్ వాసి డా.టి.సంతోష్ గౌడ్*
జాతీయ స్థాయిలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ విభాగం వారు మానసిక వ్యాధిగ్రస్తుల బాగు కోసం ఎన్నో రకాల కార్యక్రమాలు చేపడుతూ మానసిక ఆరోగ్యం పై అవగాహన కల్పిస్తున్నారు.అయినప్పటికీ దేశంలో రోజు రోజుకు పెరిగిపోతున్న ఆత్మహత్యల నివారణకై శనివారం బెంగళూరు లో ఏర్పాటు చేసిన కార్యశాలకి దేశం మొత్తంలో కేవలం ఎంపిక చేసిన 30 మందిని శిక్షణ ఇవ్వడం జరిగిందని పరిశోధక విద్యార్థి డా.టీ సంతోష్ గౌడ్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్మహత్యలకు పాల్పడే వ్యక్తుల గుర్తింపు విధానాలు,తీవ్ర మానసిక ఆలోచనల ద్వారా నిర్మాణమయ్యే ఆత్మహత్య ప్రేరేపిత ఆలోచనలను తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలపై కూలంకుషంగా నిమాన్స్ అడిషనల్ ప్రొఫెసర్ డా.అనీష్ చేరియన్,రీసెర్చ్ అసోసియేట్ డా.బరాక్ వివరించడం జరిగిందన్నారు.అలాగే తెలంగాణ నుండి ఎంపిక కావడంతో పాటు తెలంగాణలో రైతుల ఆత్మ హత్య పై పాత్ర సమర్పణ చేయడం జరిగింది
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్,బెంగళూరు కి తాను ఎంపికవ్వడం పట్ల ప్రొఫెసర్ పి. విష్ణుదేవ్ హర్షం వ్యక్తం చేశారు.
బీబీపెట్ వాసి డా.టి.సంతోష్ గౌడ్ కు అరుదైన గౌరవం
RELATED ARTICLES