అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసంచేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికల్లో దేవుళ్ళమీద ఒట్లు వేస్తూ ప్రజలను మరోసారి మోసం చేయాలని చూస్తున్నారని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.
శుక్రవారం సంగెం మండలం చింతలపల్లి,వంజరపల్లి,కృష్ణానగర్,సంగెం,కుంటపల్లి,కాట్రపల్లి,వేంకటాపూర్ గ్రామాలలోని బిఆర్ఎస్ కార్యకర్తలతో గ్రామాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే సార్వత్రిక ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటేలు అమలు చేసి లోక్ సభ ఎన్నికల్లో ఓట్లు అడగాలని అన్నారు.ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండ దేవుళ్ళ మీద ప్రమాణాలు చేస్తూ ప్రజలను మళ్ళీ మోసం చేయడానికి సిఎం రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారని అన్నారు.మే మాయ మాటలు ప్రజలు మళ్ళీ నమ్మి మోసపోవడానికి సిద్దంగా లేరని అన్నారు.కాంగ్రెస్ నమ్మి మోసపోయి గోసపడుతున్నామని గ్రామాలలో మేము తిరుగుతున్న తరుణంలో ప్రజలు మొరపెట్టుకుంటున్నారని తెలిపారు.బిఆర్ఎస్ గెలిస్తేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ప్రజలు విశ్వసిస్తున్నారని తెలిపారు.పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,మాజీ ఎంపిటిసి లు,సర్పంచులు,బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
బిఆర్ఎస్ పార్టీ గెలిస్తే నే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది -మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
RELATED ARTICLES