సంగెం మండలం రామచంద్రపురం గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇక బిక్షపతి ఆధ్వర్యంలో ఆదివారం రోజు బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి పరకాల నియోజకవర్గం ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి హన్మకొండ లోని ఆయన నివాసంలో కాంగ్రెసు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ సహకరించాలని కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా కష్టపడి పని చేయాలని అలాగే కాంగ్రెస్ పార్టీ అంటే కన్నతల్లి పార్టీ అని అన్నారు, అలాగే పార్టీ లో చేరిన వారు నాగారబోయిన మల్లయ్య యాదవ్ తోపుచెర్ల వెంకన్న సుంచికాల రవీందర్ రావు, జక్క రమేష్ యాదవ్ ,నాంపల్లి రాజయ్య ఎర్రమంటి నవీను బచ్చాటి రాంబాబు శ్రీకాంత్ ప్రశాంత్ కత్తి రాజాలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో చేరారు.
బిఆర్ఎస్ పార్టీ ఖాళీ…కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు
RELATED ARTICLES