Wednesday, January 22, 2025

బాల్య వివాహాలు చేస్తే కఠిన చర్యలు తప్పవు

శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ మండలం జంబులబండ స్థానిక జిల్లా పరిషద్ ఉన్నత పాఠశాల లో ఆర్.డి.టి,మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో  “బాలికలను చదివిద్దాం-బాలికలను రక్షిద్దాం” అనే కార్యక్రమం ఆర్ డి టి మహిళా విభాగం టీం లీడర్ ఆదినారాయణ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుడిబండ  ప్రాజెక్ట్ మహిళా శిశు అభివృద్ధి పథక అధికారిని పద్మావతి, ఆర్ డి టి మడకశిర రిజినల్ డైరెక్టర్ మల్లికార్జున, మండల విద్యాధికారి రవిచంద్ర విచ్చేసినారు.
గుడిబండ  ప్రాజెక్ట్ మహిళా శిశు అభివృద్ధి పథక అధికారిని పద్మావతి మాట్లాడుతూ చిన్న వయసులో వివాహాలు చేయడం వల్ల  అమ్మాయిలు మానశిక, శారీరక ఒత్తిడికి గురి కావడం మరియు ప్రసవ సమయంలో తల్లి బిడ్డ ప్రాణాలు కోల్పోతారని  తెలుపుతూ ఆడ పిల్లలకు 18 సంవత్సరాలు మగ పిల్లలకు 21 సంవత్సరాలు నిండిన తరువాతే వివాహ ప్రయత్నాలు చేయడం ఉత్తమము అని తెలియజేశారు అలా కాకుండా బాల్య వివాహం చేయాలని చూస్తే  బాల్య వివాహ నిరోధక చట్టం 2006 ప్రకారం బాల్య వివాహాo చేసుకున్న, నిర్వహించిన, సహకరించిన మరియు హాజరైన  ప్రతి ఒక్కరూ శిక్షార్హులు ఇందుకు గాను రెండు సంవత్సరాలు జైలు శిక్ష లేదా లక్ష రూపాయలు జరిమానా లేదా రెండు విదింప బడుతాయి అని  తెలియజేస్తూ ఎక్కడైనా బాల్య వివాహాలు చేయాలని ప్రయత్నిస్తుంటే వెంటనే టోల్ ప్రీ నంబర్లు 1098, 100 మరియు 112 లకు సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటారని తెలియజేసినారు.
ఆర్ డి టి మడకశిర రిజినల్ డైరెక్టర్ మల్లికార్జున ఆర్ డి టి సంస్థ ప్రతి మండలంలో ప్రభుత్వ శాఖల సమన్వయంతో బాలల హక్కుల పరిరక్షణ కోసం ముందస్తు చర్యగా  గ్రామ స్థాయిలో మరియు పాఠశాలలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని అందులో ముఖ్యంగా బాల్యవివాహాలు, లైంగిక వేధింపులు, మంచి స్పర్శ మరియు చెడు స్పర్శ వలన కలిగే అనర్థాలను లఘు చిత్రాల ద్వారా తల్లిదండ్రులకు మరియు చిన్నారులకు అర్థమైయ్యే విదంగా అవగాహన కల్పిస్తున్నామని తెలియజేసినారు.
మండల విద్యాధికారి రవిచంద్ర మాట్లాడుతూ ప్రభుత్వము మరియు స్వచ్ఛంద సంస్థలు సమిష్టిగా పని చేసినపుడే బాల్య వివాహ వ్యవస్థను రూపు మాపవచ్చునని వారు తెలిపినారు అంతే కాకుండా అమ్మాయిలు  తల్లిదండ్రులకు నమ్మకాన్ని ఇస్తూ చదువు మీద దృష్టి పెట్టి బాగా చదువుకోవాలని మరియు ఉన్నత లక్ష్యాలను చేరుకోవడం కోసం మధ్యలో ఎదురైయ్యే చిన్న చిన్న ఆకర్షణలను త్యాగం చేసినపుడే గొప్పవారు అవుతారని తెలియజేసినారు.
ఈ కార్యక్రమంలో  ఐ సి డి ఎస్ సూపర్వైజర్ కమలమ్మ , జిల్లా పరిషద్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు హరిప్రసాద్, అంగన్వాడి కార్యకర్తలు మరియు చిన్నారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular