బాలిక చట్టాలు, గుడ్ టచ్ బ్యాడ్ టచ్, లైంగిక వేధింపులు, తదితర అంశాల పైన విద్యార్థినిలకు శనివారం పట్టణ ఎస్సై నగీన ఆధ్వర్యంలో ఆళ్లగడ్డ సచివాలయ మహిళ పోలీసులు సాగర్ కుమారి, రెహానా బేగం ,శకుంతల, రమాదేవి, గ్రీష్మ చౌదరి, తదితరులు బాలికలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆళ్లగడ్డ పట్టణంలోని బాలికల పాఠశాలలో విద్యార్థినిలు తల్లిదండ్రులకు మత్తు పదార్థాలు, బాలికల చట్టాలు హక్కులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికిఆళ్లగడ్డ పట్టణ ఎస్సై నగీన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి తరం దేశం బాగుపడాలన్న అంటే యూత్ ఆవశ్యకత ఎంతో అవసరం అని కానీ నేడు ఎంతో మంది విద్యార్థులు మార్గద్ర వేలకు బానిసలుగా జీవితాలను నాశనం చేసుకుంటున్నారు అన్నారు మత్తు పదార్థాలు మారకద్రవ్యాల గురించి వాటి యొక్క ప్రభావం తీవ్రత గురించి విద్యార్థులకు వివరించారు. కుటుంబం మెరుగైన సమాజం కోసం విద్యార్థులు కృషి చేయాలని అన్నారు దేశాన్ని మార్చగలిగే శక్తి ఒక యువతకు మాత్రమే ఉందని ఈనాటి విద్యార్థిని విద్యార్థులు రేపటి యువతని సంభోదించారు. విలువైన కాలాన్ని వృధా చేసుకోకుండా సకాలంలో వినియోగించుకోవాలని కష్టపడుతున్న తల్లిదండ్రులకు భారం కాకుండా బలం అవ్వాలన్నారు. అనంతరం ఆళ్లగడ్డ సచివాలయాల మహిళ సంరక్షణ అధికారులు మాట్లాడుతూ బాల్య వివాహాల వల్ల అమ్మాయి అబ్బాయి జీవితాలు నాశనం అవుతాయి అన్నారు. అలాగే బాలల హక్కులను పిల్లల తల్లిదండ్రులు వారి సంరక్షకులు బాలికల పట్ల ఎలాంటి లింగ వివక్ష లేకుండా సమానంగా చూసే విధంగా తల్లిదండ్రులు బాలికలకు స్వేచ్ఛ స్వాతంత్రాలను ఇవ్వాలన్నారు. బాలికల హక్కులను కాపాడి వారి బంగారు భవిష్యత్తుకు పునాదులు వేయాలని ఈ సందర్భంగా వారు తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. బాల్యవివాహాలను అరికటంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. బాలికల్లో ఆత్మ స్థైర్యం కలిగించడం మనందరి బాధ్యత అన్నారు. బాలిక చట్టాలు వాటి అమలు తదితరు అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉపాధ్యాయ బృందం విద్యార్థినిలు తల్లిదండ్రులు సచివాలయ ల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
బాలిక చట్టాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు
RELATED ARTICLES