కర్నూలు జిల్లా కోసిగి మండలం దొడ్డి గ్రామంలో స్కూలుకు వెళ్లవలసిన విద్యార్థులు ఎమ్మిగనూరు డిపోకు చెందిన ఏపీఎస్ఆర్టీసీ బస్సులు పాఠశాలకు వెళ్లవలసిన సమయంలో తాము ఆపమని చేతులెత్తిన బస్సులు ఆపడం లేదంటూ ఆవేదనతో రోడ్డుపై బైఠాయించారు. అసలే పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలు సమయం అందులోనూ ఒక పిరియడ్ లేటుగా వెళ్లిన విలువైన పాఠాలను కోల్పోవడమే కాక పాఠశాలకు ఆబ్సెంట్ గా లెక్కిస్తారు అని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అదే దారిలో కోసిగి వెళుతున్న టిడిపి బీసీ నాయకులు రామకృష్ణారెడ్డి విద్యార్థులను గమనించి వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు రోధిస్తూ తమ సమస్యను వివరిస్తున్న విద్యార్థులను ఆయన ఓదార్చి కోసిగి నుంచి ఎమ్మిగనూరు వైపు వెళ్తున్న బస్సును ఆపి విద్యార్థులను బస్సులు ఎందుకు ఎక్కించుకోలేదని ఇంకొకసారి ఇలాంటి పరిస్థితి జరగకుండా జాగ్రత్త వహించాలని బస్సు డ్రైవర్ కు కండక్టర్ కు సూచించారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తికి విద్యార్థుల సమస్యలు అర్థం కావని నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ఉన్న బీసీలకు అభివృద్ధి ఎక్కడ జరగలేదని, ప్రజలు గమనించి బీసీలకు ఒక అవకాశం ఇవ్వాలని కోరారు, అనంతరం ఎమ్మిగనూరు బస్ డిపో మేనేజర్ తో ఫోన్లో మాట్లాడి స్కూల్ సమయానికి బస్సు వచ్చేలా విద్యార్థుల కోసం బస్ నిలబెట్టేలా ఏర్పాటు చేయాలని వివరించారు.
బస్సులు రాలేదని రోడ్డుపై బైఠాయించిన చిన్నారులు
RELATED ARTICLES