హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వరంగల్ వెస్ట్ నియోజకవర్గ సమావేశం మరియు హనుమకొండ ప్రెస్ క్లబ్ లో సమావేశానికి వరంగల్ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న హాజరుకాగా హనుమకొండ జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ పాల్గొన్నారు. రామకృష్ణ మాట్లాడుతూ వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లలో తీన్మార్ మల్లన్న కు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్క పట్టభద్రులకు డివిజన్ అధ్యక్షులు మరియు నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరికి అర్థం అయ్యే పద్ధతిలో చెప్పాలి బ్యాలెట్ బాక్స్ లో రెండో నెంబర్ కాంగ్రెస్ పార్టీ పేరు ఉంటుంది మల్లన్న పేరు ఉంటుంది చెయ్యి గుర్తు ఉండదు కాబట్టి అక్కడ ఒకటో నెంబర్ ను రాయాలి . ప్రతి ఒక్క ఓటు గల్లంత్ కాకుండ చూడాలని కోరారు మల్లన్న ను గెలిపించుకుంటే ప్రభుత్వానికి వారధిగ మన సమస్యలు తీరుస్తారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది మరియు కేంద్రంలో వచ్చేది కూడా కాంగ్రెస్ పార్టీయే అన్ని విధాలా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు మరియు జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ జనరల్ సెక్రెటరీ ఎంవి లాజరెస్ ఎస్సీ డిపార్ట్మెంట్ సెక్రటరీ ఈర మహేందర్ ,మాతంగి రాజు మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి : డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ
RELATED ARTICLES